సలార్ సినిమా నుంచి లీకైన వీడియో.. వైరల్..!!

-

టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కెరియర్ లో ఎన్నో విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ ఉంటారు ప్రభాస్. ఇక బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆది పురుష్ చిత్రానికి సంబంధించి టీజర్ ఇటీవల విడుదల కాగా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక కేజిఎఫ్ చిత్ర డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇక ఈ చిత్రం పైనే అటు ప్రభాస్,ప్రభాస్ అభిమానులు కూడా చాలా నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఏదో ఒక రూపంలో ఈ చిత్రానికి సంబంధించి సన్నివేశాలు లీక్ అవుతూనే ఉన్నాయి.

ఇప్పుడు తాజాగా ప్రభాస్ లుక్కుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఇక ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ప్రభాస్ ఒక మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ముఖ్యంగా చాలా గుబురు గడ్డంతో కనిపించడం జరుగుతోంది.. అలాంటి సమయంలో ఎవరితోనూ ఏదో డిస్కషన్ చేస్తున్నట్లుగా కూడా కనిపిస్తోంది.భారీ అంచనాల మధ్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి లికులతో చిత్ర బృందం చాలా ఆందోళనలో పడేస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. కే జి ఎఫ్ చిత్రాన్ని గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కించగా.. సలార్ చిత్రాన్ని బ్లాక్ గోల్డ్ కొల్ మైనింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ధరకెక్కిస్తున్నట్లు సమాచారం.

వాస్తవానికి ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల చేత ఆలస్యం అయ్యింది. ముఖ్యంగా ప్రభాస్ డేట్స్ అడ్జస్ట్ కాక ఈ సినిమా ఆలస్యమైందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. మరి చిత్రంతోనైనా ప్రభాస్ అభిమానులను అలరిస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news