కత్రినా కైఫ్ బ్రదర్​తో ఇలియానా లవ్​ట్రాక్..!

-

గోవా బ్యూటీ ఇలియానా కత్రినా కైఫ్ సోదరుడితో డేటింగ్​లో ఉందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పోకిరి భామ కత్రినా బర్త్​ డే వేడుకల్లో పాల్గొనడం ఈ పుకార్లు నిజమేనని నిరూపిస్తున్నారు. ఆ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
‘దేవదాసు’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. ‘బర్ఫీ’తో అటు బాలీవుడ్‌లోకీ అడుగుపెట్టి.. ప్రస్తుతం సరైన విజయాల్లేక సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది.


గతంలో ఆండ్రూ అనే విదేశీ ఫొటో గ్రాఫర్​తో ప్రేమలో పడిన ఇలియానా కొన్నేళ్ల పాటు డేటింగ్​ చేసి 2019లో విడిపోయారు. కొన్నిరోజుల పాటు సింగిల్​గా ఉన్న ఈ గోవా బ్యూటీ మళ్లీ ప్రేమలో పడిందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈమె కత్రినా కైఫ్‌ సోదరుడు సెబాస్టియన్‌తో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.


ఈ ఏడాది కత్రినా.. తన పుట్టినరోజు వేడుకల కోసం భర్త విక్కీ, సోదరుడు సెబాస్టియన్‌, ఇతర కుటుంబసభ్యులతో కలిసి మాల్దీవులకు వెళ్లగా ఈ వేడుకల్లో ఇలియానా కూడా పాల్గొంది. సెబాస్టియన్‌తో సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను కత్రినా, ఇలియానా ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది.


వీటిని చూసిన నెటిజన్లు.. ‘ఎలాంటి సంబంధం లేకుండా ఇలియానా ఈ వేడుకల్లో ఎందుకు పాల్గొందంటూ చర్చించుకుంటున్నారు. దీంతో ఈ జంట ప్రస్తుతం డేటింగ్‌లో ఉందంటూ పలు వెబ్‌సైట్‌లలో వార్తలు వెల్లువడ్డాయి. మరోవైపు సెబాస్టియన్‌ ఇన్‌స్టా ఖాతాని ఇలియానా గత కొంతకాలంగా ఫాలో అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version