ఇంజినీర్ ఉద్యోగాన్ని వదిలి పశుపోషణ..లక్షల్లో ఆదాయం.. సక్సెస్ స్టోరీ..

-

మన దేశంలో ఉద్యోగం చేసేవారి కంటే ఖాళీగా ఉన్న వారిసంఖ్య ఎక్కువగా ఉంది..ప్రతి ఏడాది నిరుద్యోగుల సంఖ్య పెరిగి పోతుంది.చాలామంది ఉద్యోగాలు లేక కంపెనీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండగా మరికొంతమంది మాత్రం ఉన్న జాబులను వదిలేస్తున్నారు. అయితే నిరుద్యోగ యువత జీవితాలు అంతంత మాత్రమే ఉండగా ఈ కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది..

లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడ్డారు..తినడానికి తిండి కూడా లేకపోవడంతో ఎంతో మంది ప్రాణాలను వదిలారు.అయితే ఓ వ్యక్తి మాత్రం ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి వ్యాపారం లోకి అడుగు పెట్టాడు.ఆవు పాలు, పేడ అమ్మడం ద్వారా లక్షల రూపాయలు ఆర్జిస్తున్నాడు. పూర్తి వివరాలలోకి వెళితే..కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన జయగురు ఆచార్ హిందర్ సివిల్ ఇంజనీరింగ్ చదివాడు. అయితే చదువు పూర్తి అయిన తర్వాత ఉద్యోగం కూడా చేశాడు. కానీ అతని మనసు ఉద్యోగం పై నిమగ్నం కాలేదు.

జయగురుకు మొదటి నుంచి వ్యవసాయంపై ఆసక్తి ఉండడంతో 2019లో ఉద్యోగం వదిలేసి తండ్రితో పాటు కలిసి వ్యవసాయ పనులు చూసుకోవడం మొదలుపెట్టాడు. అలా అతి తక్కువ సమయంలో 130 ఆవుల పోషణ చేపట్టాడు. జయగురు డెయిరీ నెలకొల్పి, పాల ఉత్పత్తుల విక్రయం చేపట్టాడు. పటియాలాలో ఆవు పేడను ఎండబెట్టే యంత్రాన్ని కొనుగోలు చేశాడు. పాడిపనుల కోసం 10 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ప్రతి నెలా 10 లక్షల రూపాయలు సంపాదిస్తు ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు జయగురు. దేశవ్యాప్తంగా జయగురు తో పాటు ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు.వ్యాపారం సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తూ అందరికి ఆదర్సంగా నిలిచారు…

Read more RELATED
Recommended to you

Exit mobile version