పవన్ కల్యాణ్‌తో ఫేమస్ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి.. ‘హరిహర వీరమల్లు’ షూట్ స్టార్ట్స్..

-

జనసేనాని పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’గా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మూడేళ్ల ‘అజ్ఞాతవాసం’ తర్వాత వచ్చారు. ఇక అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘భీమ్లా నాయక్’ కూడా బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. ఈ సంగతులు పక్కనబెడితే పవన్ కల్యాణ్ చేస్తున్న తొలి పీరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ యాభై శాతం పూర్తి అయినట్లు సమాచారం.

thota tarani hari hara veeramallu
thota tarani hari hara veeramallu

ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం మెగా సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ.దయాకర్ రావుతో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పిక్చర్ మొఘలుల కాలం నేపథ్యంలో సాగనుంది. తెలంగాణలోని హైదరాబాద్‌లో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ చిత్రం కోసం భారీ జలపాతం సెట్ వేశారు. దీనిని ఫేమస్ ఆర్ట్ డైరెక్టర్ పద్మశ్రీ తోట తరణి ఏర్పాటు చేశారు. దీనిని సోమవారాం పవన్ కల్యాణ్ పరిశీలించారు.

ఇందుక సంబంధించిన ఫొటోను ట్విట్టర్ వేదికగా చిత్ర యూనిట్ షేర్ చేయగా, నెట్టింట అది తెగ వైరలవుతోంది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, కీలక పాత్రల్లో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, హీరోయిన్ సోనాక్షి సిన్హా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించినట్లు తెలుస్తోంది. ఎం.ఎం.కీరవాణి ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా, చిత్రంపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news