తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘లియో’ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. సినిమాలో విజయ్, త్రిష, సంజయ్ దత్ లుక్ ఆకట్టుకోగా, ఎలివేషన్స్, మ్యూజిక్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. లియో సినిమా ఈనెల 19న రిలీజ్ కానుండగా.. యూఎస్ఏ ప్రీసేల్స్ అప్పుడే 500K$ దాటింది.
ఈ సినిమాకు ఓవర్సీస్లో బుకింగ్స్ ఓపెన్ కాగా.. 40వేలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయని తెలిసింది. అయితే సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే ఇన్ని వేల సంఖ్యలో టికెట్స్ అమ్ముడుపోవడం విశేషం. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ట్వీట్టర్లో తెలిపింది. థియేటర్ల సంఖ్యను కూడా పెంచనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. అప్పటివరకు 50వేలకు పెరగొచ్చు. అయితే ఇంత వరకు ఏ ఇండియన్ సినిమాకు ఈ స్థాయిలో టికెట్లు అమ్ముడుపోలేదని యూకేకు చెందిన నిర్మాణ సంస్థ ప్రకటించింది. మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండానే ఇంత భారీ మొత్తంలో టికెట్లు సేల్ అవ్వడం ఓ రికార్డని పేర్కొంది. విడుదల ముందు నాటికి ఈ సంఖ్య 50వేలకు చేరవచ్చని నిర్మాణ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది. అయితే దీని ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను కూడా చిత్రయూనిట్ రద్దు చేయడం చర్చనీయాంశమైంది. ఈ సినిమాలోని విజయ్ పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి.