LIC నుండి సూపర్ స్కీమ్.. జీవిత కాలం పెన్షన్ ని ఇలా పొందండి…!

-

LIC ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చక్కగా లాభాలను పొందొచ్చు. జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసి ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. అయితే LIC అందించే వాటిల్లో న్యూ జీవన్ శాంతి కూడా ఒకటి. ఈ పెన్షన్ లింక్డ్ బీమాతో ఎన్నో రకాల ప్రయోజనాలను పొందొచ్చు.

ఇక పూర్తి వివరాల లోకి వెళితే… భవిష్యత్తు కోసం డబ్బులని సేవ్ చేసుకోవాలని అనుకునే వారు దీన్ని ఎంపిక చేసుకోవచ్చు. దీనిలో మీరు ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు జీవితమంతా పెన్షన్ గ్యారంటీ లభిస్తుంది. అలానే ఈ పాలసీ లో రెండు ఆప్షన్స్ వున్నాయి. తక్షణ ఎన్యుటీ ఒకటి. డిఫర్డ్ ఎన్యుటీ రెండోది. డిఫర్డ్ ఎన్యుటీలో పాలసీ తీసుకున్న 5,10,15 లేదా 20 ఏళ్ల తరువాత పెన్షన్ మీకు వస్తుంది.

అదే మీరు కనుక తక్షణ ఎన్యుటీలో పాలసీ తీసుకుంటే వెంటనే పెన్షన్ లభిస్తుంది. ఇక రెండవ డిఫర్డ్ ఎన్యుటీలో పాలసీ తీసుకున్న తరువాత అంటే 5,10,15 లేదా 20 ఏళ్ల తరువాత పెన్షన్ సౌలభ్యం లభిస్తుంది. పెట్టుబడి, వయస్సు, డిఫర్మెంట్ పీరియడ్ ఆధారంగా పెన్షన్ మీకు వస్తుంది. ఈ పాలసీ ని పొందాలంటే కనీస వయస్సు 30 ఏళ్లు. గరిష్ట వయస్సు 85 ఏళ్లు. రుణం, పెన్షన్ ప్రారంభమైన ఒక ఏడాది తరువాత దీన్ని సరెండర్ చేయవచ్చు. పాలసీ ఆప్షన్స్ ని మార్చలేరు కనుక పాలసీ లో చేరేటప్పుడే మీరు ఆప్షన్ ని ఎంపిక చెయ్యండి.

 

Read more RELATED
Recommended to you

Latest news