చిరిగిపోయిన నోట్లు ఏటీఎం నుండి వచ్చాయా..? అయితే ఇలా చెయ్యండి..!

-

మన దగ్గర క్యాష్ లేకపోతే ఏటీఎం నుండి డబ్బులని విత్డ్రా చేసుకుంటూ ఉంటాము. ఒక్కోసారి క్యాష్ లో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అలాంటి పొరపాట్లు కనుక జరిగితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకవేళ కనుక ఏటీఎంల నుంచి డబ్బు విత్‌డ్రా చేస్తున్నప్పుడు డ్యామేజ్ అయితే ఏం చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. చిరిగిపోయిన నోట్లు కనుక వస్తే ఇలా చెయ్యండి.

చిరిగిపోయిన నోట్లు మారవు. అందుకని ఇలాంటి నోట్లు వస్తే మార్చుకోవాలి. ఈ నోట్లను మార్చుకునే మార్గాలను ఇక్కడ వివరించాము. మరి వాటి కోసం ఇప్పుడు చూడండి. సెంట్రల్‌ బ్యాంకు ఈ నోట్లని మార్చే విధానం కోసం చెప్పింది. చిరిగిపోయినా, నకిలీ నోట్లు కానీ వస్తే బ్యాంకు లో డిపాజిట్‌ చేసుకుని కొత్త నోట్లను తీసుకోవచ్చని ఆర్బీఐ అంటోంది. మీరు ఎలాంటి రుసుము దీని కోసం చెల్లించాల్సిన పనే లేదు. బ్యాంకులు ఈ నోట్లని తీసుకుని మీకు మరొక నోట్లని ఇస్తారు.

చిరిగిన నోట్లు బ్యాంకు ఏటీఎం నుండి వస్తే.. ఈ నోట్లను మార్చుకోవడానికి బ్యాంకు అడ్డు చెప్పదు. జూలై 2016లో ఆర్‌బీఐ దీని మీద ఓ సర్క్యులర్ ని కూడా తీసుకు వచ్చింది. బ్యాంకు నోట్లను మార్చుకోవడానికి నిరాకరిస్తే.. ఆ బ్యాంక్ మీద చర్యలు కూడా తీసుకుంటారు. అలాంటి బ్యాంకుకు 10 వేల రూపాయల వరకు జరిమానా వేస్తారట. గరిష్టంగా 20 నోట్లను మార్చుకోవచ్చు అంత కంటే ఎక్కువ నోట్లు మార్చేందుకు కుదరదు. వీటి విలువ రూ.5000 మించకూడదు చూసుకోండి.

 

Read more RELATED
Recommended to you

Latest news