మై హోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావుకు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు

ప్రముఖ వ్యాపారవేత్త, మై హోమ్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర రావు కు అరుదైన అవార్డు వచ్చింది. ఆయన తాజాగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు జూపల్లి రామేశ్వరరావు. ఈ సందర్భంగా మై హోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచంలోనే హైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని.. హైదరాబాద్ అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ రంగం కీలక పాత్ర వహించింది అని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించ వద్దని… తన సన్నిహితులకు సూచిస్తున్నాం అని ఆయన వెల్లడించారు. న్యాయంగా.. అందరికీ సమ న్యాయం చేసుకుంటూ వ్యాపారాలను కొనసాగించాలని మై హోమ్ రామేశ్వరరావు తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద వ్యాపారస్తులు గా మై హోమ్ రామేశ్వరరావు అభివృద్ధి చెందారు. అలాగే టీవీ9 న్యూస్ ఛానల్ యాజమాన్య బాధ్యతలను కూడా మై హోమ్ రామేశ్వరరావు వహిస్తున్నారు.