హీరో నానికి నిర్మాత నట్టి కుమార్ కౌంటర్.. నీకేం తెలుసని మాట్లాడుతున్నావ్ !

సినిమా టికెట్ల ధరల విషయం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై న్యాచురల్ స్టార్ నని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ లో సినిమా టికెట్ రేట్ల విషయం పై నాని చేసిన సంచలన వ్యాఖ్యల కు టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నానికి సినిమా కలెక్షన్ల గురించి ఏం తెలుసు ? అలోచించి మాట్లాడాలని ఫైర్ అయ్యారు నట్టి కుమార్.

తెలియని విషయాల్లో జోక్యం చేసుకోవడం నాని మానుకోవాలని.. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చురకలు అంటించారు. కాగా టికెట్ ధరలను తగ్గించి ప్రేక్షకుడిని అవమానించారని.. ధరలు పెంచినా టికెట్ కొనుక్కునే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని జగన్ సర్కార్ పై అంతకు ముందు హీరో నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నలుగురికి ఉపాధి కల్పించే థియేటర్ల కలెక్షన్ల కన్నా పక్కనే కిరాణా కొట్టు పెట్టుకున్న వారికి కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయంటూ  ఫైర్ అయ్యారు.