లైగర్ నుంచి బిగ్ అప్డేట్..బోల్డ్​ లుక్​లో విజయ్​దేవరకొండ..!

-

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా రూపొందుతోంది. పూరి జగన్నాథ్, నటి చార్మి, కరణ్ జోహార్ కలిసి పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు.


అయితే తాజాగా లైగర్ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది. విజయ్ దేవరకొండ “లైగర్” మరో లుక్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. పూరీ మార్క్ యాక్షన్ సన్నివేశాలతో రౌడీ బాయ్.. గ్లింప్స్‌ లో పవర్ ఫుల్ ఎంట్రీ ఇవ్వగా…ఈ పోస్టర్‌ లో విజయ్‌ దేవరకొండ దుమ్ములేపుతున్నాడు. తన బాడీ మొత్తం చూపించి.. అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ పోస్టర్‌ చూసిన ఫ్యాన్స్‌, నెటిజెన్స్ కూడా తెగ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ సినిమా ఆగస్టు 25 వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news