తమీమ్ ఇక్బాల్ రిటైర్మెంట్ గురించి నన్ను అడగొద్దు: లిటన్ దాస్

-

నిన్న ఉదయం బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ మరియు నిన్నటి వరకు వన్ డే కెప్టెన్ గా ఉన్న తమీమ్ ఇక్బల్ సడెన్ గా అన్ని ఫార్మాట్ ల నుండి తప్పుకుంటున్నాను అంటూ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బంగ్లా అభిమానులు చాలా బాధలో ఉన్నారు, తమీమ్ ఇక్బల్ ఫ్యాన్ ఒకతను అయితే ఈ విషయం తెలిసిన వెంటనే చాలా ఏద్వడం సంచలనంగా మారింది. కాగా తాజాగా ఆ జట్టు ఆటగాడు లిటన్ దాస్ ను మీడియా సమావేశంలో ఈ విషయం గురించి ప్రశ్నించగా, అతను ఏ మాత్రం సమాధానము చెప్పకుండా మీరు ఈ విషయం గురించి నాతో మాట్లాడాలి అనుకుంటే… నేను వెళ్లిపోతాను, మా టీం యాజమాన్యాన్ని అడగండి అంటూ కోపం తెచ్చుకున్నాడు. ప్లేయర్ లు అంతా ఎప్పటిలాగే కలిసి కట్టుగా, దేశం కోసం మాత్రమే ఆడుతున్నాము.

ఏమి జరిగినా వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితుల్లో మేము లేము అంటూ సమాధానం చెప్పాడు. దీనితో జట్టుతో సరైన అనుబంధం లేకనే తమీమ్ రిటైర్ అయ్యాడా అంటూ అనుమానాలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news