ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీ ఇలా ఎవరితోనైనా మామూలుగా ఎంజాయ్ చేసేందుకు రెస్టారెంట్‌లకు వెళుతూనే ఉంటాం. అయితే.. మనం ఆర్డర్ చేసిన ఫుడ్‌లో బొద్దింకో, లేక బల్లి ఇలా ఇంకేదైనా దర్శనమిస్తే పరిస్థితి ఏంటి.. అలాంటి ఘటనే అహ్మదాబాద్‌కు చెందిన భార్గవ జోషికి ఎదురైంది. భార్గవ జోషి తన స్నేహితుడితో కలిసి అహ్మదాబాద్‌లోని మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ వెళ్లాడు.. తాగడానికి కోక్ ఆర్డర్ ఇచ్చాడు.. అయితే.. ఓ టేబుల్ దగ్గర కూర్చొని కోక్‌ను ఆస్వాదిద్దామనుకునే సరికి.. కోక్‌లో చనిపోయిన బల్లి దర్శనమిచ్చింది.
దీంతో ఖంగుతిన్న భార్గవ సంబంధిత సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేశాడు. వారు.. మెక్‌డొనాల్డ్స్ అవుట్ లెట్ మేనేజర్ దృష్టికి ఈ విషయాని తీసుకెళ్లడంతో.. అతను చాలా సింపుల్‌గా.. ఆ విషయానికి అంత ప్రాధాన్యం ఇవ్వలేదని భార్గవ ఆరోపించాడు. అంతేకాదు, కూల్ డ్రింకుకు చెల్లించిన డబ్బును తిరిగి ఇస్తామని చెప్పాడని వెల్లడించాడు. దీంతో చిరెత్తిన భార్గవ్ వెంటనే ట్విట్టర్‌లో ఆ కూల్‌డ్రింక్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ.. మున్సిపల్, పోలీసులతో పాటు.. మెక్ డొనాల్డ్స్ పై అధికారులకు ట్యాగ్ చేశాడు.. కాగా, కూల్ డ్రింకులో బల్లి పడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో అహ్మదాబాద్ పురపాలక శాఖ స్పందించింది. మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్ లో తనిఖీలు చేపట్టింది. ఆపై రెస్టారెంటును మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కూల్ డ్రింకు శాంపిల్స్ ను పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీకి పంపించారు.
https://twitter.com/Bhargav21001250/status/1528689006463967232?s=20&t=Qk045Fs6m7W0N9T5g6BgIA