మే 25 బుధవారం రాశి ఫలాలు.. ఈరోజు అదృష్టం ఎవరికీ ఉందో ఇప్పుడు చుద్దాము..

-

మే 25 బుధవారం రాశి ఫలాలు.. ఈరోజు అదృష్టం ఎవరికీ ఉందో ఇప్పుడు చుద్దాము..

మేషం: కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వ్యాపార ,ఉద్యోగాలలొ పురోగతి ఉండదు. అనవసరంగా కొన్ని వస్తువులు కొని వృధా చేస్తారు.ఈరోజు ఆలొచించి ఏదైనా చెయ్యడం మంచిది.

వృషభం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితులు, బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆదాయమార్గాలు పెరుగుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. వ్యాపార ఉద్యోగాలలో సకాలంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రయాణాలు చేస్తారు.

మిథునం: బంధువుల నుంచి శుభకార్యాలు అందుతాయి.స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు..దీర్ఘకాలిక సమస్యలు దూరం అవుతాయి.

కర్కాటకం: పాత ఋణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి సహాయం అందక ఇబ్బంది పడతారు. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది..దైవదర్శనాలు చేయాలి..ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

సింహం: అందవలసిన ధనం సకాలంలో అందక నిరాశ కలుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలలో శ్రమ అధికమవుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుండి మాటలు పడాలి..జాగ్రత్తగా ఉండాలి.

కన్య: స్ధిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు నూతన వ్యక్తుల పరిచయాలు ఉపయోగపడతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది.ఈరోజు లాభాదాయకంగా ఉంటుంది.

తుల: సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమౌతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధు మిత్రులతో వివాదాలు తీరుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు..దైవదర్శనాలు, ప్రయాణాలు చేస్తారు.

వృశ్చికం: ఎక్కువ శ్రమ పడినా ఫలితం లేకుండా పోయింది. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పెరుగుతాయి. ధనపరంగా ఒడిదుడుకులు అధికమౌతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగపరంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక మానసిక సమస్యలు కలుగుతాయి..ఆలొచించి ఏదైనా చెయ్యడం మేలు..

ధనస్సు: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి ప్రశాంతత కోసం దైవదర్శనం చేసుకోవడం మంచిది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి..బంధువులతో గొడవలు వస్తాయి.ఎవరిని నమ్మవద్దు.

మకరం: అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు కొన్ని వివాదాలకు సంబంధించి సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. నూతన వస్తు లాభాలు పొందుతారు సమాజంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఉద్యోగాలలో మంచి వార్తలు వింటారు.సమాజంలో గౌరవం పెరుగుతుంది.

కుంభం: ఇంటాబయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి బంధు మిత్రుల మాటలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. అధిక శ్రమతో గాని పనులు పూర్తి కావు. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు కలిగే సూచనలున్నవి. ఉద్యోగాలలో అధికారులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు..కీలక విషయాలను చర్చలు జరపాలి.

మీనం: నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది..ఈరోజు ఫలిథాలు లాభదాయకంగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news