టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ముంబాయి.. నేడే చివరి లీగ్‌ మ్యాచ్‌..

ఐపీఎల్ తాజా సీజన్ లీగ్ దశలో నేడు చివరి మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబాయి ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబాయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. ఢిల్లీ ఓడితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లే ఆఫ్స్ లో అడుగుపెడుతుంది. అందుకే ఈ మ్యాచ్ లో ముంబయి జట్టు గెలవాలని బెంగళూరు కోరుకుంటోంది.

MI vs DC Head to Head Records, Mumbai Indians' Head-to-Head Record Against Delhi Capitals– IPL 2022 Match 69

ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టులో ఒక మార్పు చేసినట్టు కెప్టెన్ రిషబ్ పంత్ వెల్లడించాడు. లలిత్ స్థానంలో పృథ్వీ షా జట్టులోకి వచ్చాడని వివరించాడు. అటు, ముంబాయి జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. స్టబ్స్ స్థానంలో డివాల్డ్ బ్రెవిస్ జట్టులోకి రాగా, సంజయ్ స్థానంలో షోకీన్‌ను తీసుకున్నట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. టాస్ సమయంలో వర్షం పడడంతో మ్యాచ్ నిర్వహణపై ఆందోళన నెలకొంది. అయితే కొద్దిసేపటికే వర్షం ఆగిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కు ఈ ఐపీఎల్ లోనూ ఆడే అవకాశం దక్కలేదు. ఐపీఎల్-15లో ఇదే చివరి లీగ్ మ్యాచ్ కాగా, ముంబయి సాంకేతికంగా ఎప్పుడో నిష్క్రమించింది.