ప్రజల క్షేమం దృష్ట్యా లాక్ డౌన్ ని పొడిగించాలని నిర్ణయం తీసుకున్నామని, ఈ మేరకు ఒక సర్వే చేసామని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేబినేట్ సమావేశం తర్వాత ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణాలో లాక్ డౌన్ పోడిగించాలి అని మీడియా చెప్పిందని అన్నారు. తాను వ్యక్తిగతంగా అందరితో మాట్లాడా అని, అందరూ కూడా లాక్ డౌన్ ని పెంచాలని చెప్పారని అన్నారు.
సర్వేల్లో 92 శాతం లాక్ డౌన్ ని పెంచాలి అని చెప్పారని అన్నారు. అందరూ కూడా లాక్ డౌన్ ని కొనసాగించకపోతే ఇబ్బంది పడతామని చెప్పారని అన్నారు, మే 7 వరకు తెలంగాణా లో లాక్ డౌన్ ని పోడిగిస్తున్నామని అన్నారు.చాలా మంది తెలంగాణాలో లాక్ డౌన్ ని కొనసాగించాలని చెప్పారని అవసరం అయితే మే నెలాఖరు వరకు లాక్ డౌన్ ఉండాలి అని సూచించారని అన్నారు. ఫుడ్ డెలివరి సర్వీసులు అసలు ఉండవని, పిజ్జా వలన 69 మందికి కరోనా సోకిందని అన్నారు. కంటైన్మేంట్ ఏరియా లో ఎవరూ కూడా బయటకు రావొద్దని అన్నారు. ఏ ప్రాంతాల నుంచి అయినా సరే మే 7 వరకు బయటకు రావొద్దని అన్నారు.
విమాన ప్రయాణికులకు మే 7 వరకు తెలంగాణాకు రావొద్దు అని కేసీఆర్ సూచించారు. వచ్చినా ఏ విధమైనా ప్రయాణ సర్వీస్ లు ఉండవని అన్నారు. తిను బండారాలు అసలు అందుబాటులో వద్దని, ప్రజలు అందరూ అర్ధం చేసుకోవాలని సూచించారు. పండగలు, ప్రార్ధనలు ఇంట్లోనే చేసుకోవాలని, అసలు ఏ కారణం తో బయటకు రావొద్దని అన్ని మతాల వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు ఆయన.
ఉద్యోగుల జీతాల్లో కోత కొనసాగుతుందని ఆయన స్పష్టం చేసారు. అందరు ప్రజా ప్రతినిధులు కూడా విజయవంతం గా పని చేస్తున్నారని ఆయన కొనియాడారు. ఇంకా కొందరు దాతలు కూడా ముందుకు వచ్చి తమ సహకారం అందిస్తున్నారని, ఎవరూ ఉపవాసం ఉండకూడదు అని ఆయన పేర్కొన్నారు. వారందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేసారు.పోలీసులకు ఈ నెల జీతాలు ఇచ్చే సమయంలో సిఎం గిఫ్ట్ కింద పది శాతం అదనంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మున్సిపల్ సిబ్బంది సహా కొందరికి గత నెలలో ఇచ్చిన సిఎం గిఫ్ట్ ఈ నెల కూడా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేసారు.