సంబంధం లేని ప్రశ్నలు అడిగారు : లోకేశ్‌

-

ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో మాజీ మంత్రి నారా లోకేశ్ ను సీఐడీ నేడు సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఈ ఉదయం లోకేశ్ తాడేపల్లి సిట్ కార్యాలయానికి విచ్చేశారు. ఉదయం 10 గంటల తర్వాత విచారణ మొదలవగా, సాయంత్రానికి విచారణ ముగిసింది. వాస్తవానికి అక్టోబరు 4నే విచారణకు హాజరు కావాలని సీఐడీ లోకేశ్ కు నోటీసులు పంపింది. అయితే, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో లోకేశ్ ను ఇవాళ (అక్టోబరు 10) విచారించారు. లోకేశ్ ను 50 ప్రశ్నలు అడిగారు. కాగా, మరింత సమాచారం కోసం రేపు మరోసారి విచారణకు రావాలని నారా లోకేశ్ కు 41ఏ నోటీసులు ఇచ్చారు. తాను రేపు కూడా విచారణకు హాజరవుతానని లోకేశ్ తెలిపారు.

Why Nara Lokesh To Delhi Again?

తనను 50 ప్రశ్నలు అడిగినా, అందులో ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన ప్రశ్న ఒక్కటి మాత్రమే ఉందన్నారు. మంత్రినయ్యాక భూముల లే అవుట్ పై ఇచ్చిన ఓ జీవో గురించి తప్ప ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి ప్రశ్నలు అడగలేదని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డులో మేం అవినీతికి పాల్పడ్డామని గానీ, మా కుటుంబం లబ్ది పొందింది అని గానీ ఎలాంటి ఆధారాలను సీఐడీ వాళ్లు నా ముందు పెట్టలేదు అని లోకేశ్ వివరించారు. తమను అడ్డుకునేందుకు దొంగ ఎఫ్ఐఆర్ లు రూపొందిస్తూ ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు.

“ఈ కేసుకు సంబంధించి ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయని దర్యాప్తు అధికారి నాతో చెప్పారు. రేపు నేను చాలా బిజీ… ఆ ప్రశ్నలేవో ఇప్పుడే అడగండి… ఎంత సమయం అయినా ఉంటాను అని బదులిచ్చాను. కానీ సీఐడీ అధికారులు అందుకు అంగీకరించలేదు. రేపు ఉదయం 10 గంటలకు విచారణకు రావాలంటూ అక్కడిక్కడే నోటీసులు ఇచ్చారు” అని లోకేశ్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news