అసెంబ్లీలో మేము సీరియస్ గా ఉంటే.. మంత్రులు జోకులు వేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఫైర్ అయ్యారు. నిన్న గుంటూరు జిల్లాలో కల్తీ సారా తాగి ఒకరు మరణించారని.. ఇది కూడా సహజ మరణం అంటారా..? అని నిలదీశారు. అసెంబ్లీలో చర్చ నుంచి ఎందుకు పారిపోతున్నారు..?రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రోత్సాహంతో నాటు సారా తయారవుతుందన్నారు.
ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్సుగా తీసుకోవడం లేదని.. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి.. జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసిచ్చామని.. ముఖ్యమంత్రి ఎందుకు పారిపోతున్నారు…? అని అగ్రహించారు. కొందరు కల్తీ సారా తాగి చనిపోయారని మంత్రి అంటున్నారు.. సీఎం సహజ మరణాలు అంటున్నారు.. ఇందులో ఏది నిజం..? అని నిలదీశారు.
సహజ మరణాలు అయితే ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేశారు..? పుష్కరాలనేది యాక్సిడెంట్… ఇపుడు ప్రభుత్వం నిర్లక్ష్యం, కల్తీ సారాతో మరణించారన్నారు. ఎల్జీ పాలిమర్స్ మృతులకు కోటి రూపాయలిచ్చారు.. ఇపుడు కనీసం సీఎం పరామర్శించ లేదు.. మానవత్వం ఉందా..? ఎంతమంది చనిపోతే స్పందిస్తారు..?మేము సీరియస్సుగా ఆందోళన చేస్తుంటే.. మంత్రులు సభలో జోకులు వేసుకుని నవ్వుతున్నారని నిప్పులు చెరిగారు.