పదవ తరగతి విద్యార్థులతో టిడిపి ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అయితే జూమ్ మీటింగ్ నడుస్తుండగానే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కొడాలి నాని లు మధ్యలో ఎంటర్ అయ్యారు. వాళ్ళిద్దరూ ఇలా సడన్ ఎంట్రీ ఇవ్వడం పై టిడిపి నేతలు మండిపడుతున్నారు.
పదవ తరగతి విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపేందుకు లోకేష్ మీటింగ్ నిర్వహిస్తే కొడాలి నాని, వల్లభనేని వంశీ వెకిలి నవ్వులతో శాడిజం చూపించారు అంటూ టిడిపి మండిపడింది. అయితే దీనిపై స్పందించిన కొడాలి నాని.. పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులను లోకేష్ ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తున్నారని, వారితో చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు అని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు.
తాను జూమ్ మీటింగ్ లోకి వెళ్లగానే లోకేష్ భయపడి పారిపోయాడు అని ఎద్దేవా చేశారు. పిల్లలకు ధైర్యం చెప్పకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని విమర్శించారు. తన మేనల్లుడి అకౌంట్ తో జూమ్ లోకి లాగిన్ అయ్యానని, దొంగచాటుగా వెళ్లలేదని నాని స్పష్టం చేశారు.