నీళ్లు తాగుతున్నా దాహం వేస్తోందా..? అయితే ఇలా చెయ్యండి..!

-

వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎండలు విపరీతంగా మండిపోతూ ఉంటాయి. పైగా దాహం కూడా ఎక్కువగా వేస్తూ ఉంటుంది. అయితే దాహం వేస్తోంది కదా అని మనం నీళ్లు తాగుతూ ఉంటాము. అయినప్పటికీ ఇంకా దాహం తగ్గదు. అలానే దాహం ఇంకా వేస్తూ ఉంటుంది.

 

కాని నిజానికి వేసవి కాలంలో డీహైడ్రేషన్ సమస్య కి గురి అవకుండా ఉండాలి అంటే నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలానే నీళ్లతో పాటు ఎక్కువ ఫ్లూయిడ్స్ ని కూడా తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల దాహం తీరుతుంది.

లిక్విడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒంట్లో టెంపరేచర్ కూడా బ్యాలెన్స్ గా ఉంటుంది. అయితే ఎక్కువగా దాహం వేసినా.. ఎంత నీళ్లు తాగినా దాహం తీరకపోయినా ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. వీటిని కనుక మీరు అనుసరించారు అంటే దాహం వెయ్యదు పైగా దాహం తీరుతుంది.

మీరు మంచి నీళ్లు తాగిన పదేపదే దాహం వేస్తూ ఉంటే నీళ్లలో కొద్దిగా తేనె వేసుకుని ఆ నోటిని పుక్కిలించడం. లేదంటే లవంగాలను తీసుకోండి. ఇలా చేయడం వల్ల దాహం తగ్గుతుంది.
అలానే పదేపదే దాహం ఎక్కువగా వేస్తూఉంటే నట్ మెగ్ ని ఉపయోగించండి. నోట్లో నట్ మెగ్ ని ఉంచుకోవడం వల్ల కూడా దాహం తీరుతుంది.

అదే విధంగా 125 గ్రాముల ఆవుపెరుగుని తీసుకుని అందులో 60 గ్రాములు పంచదార, 5 గ్రాములు నెయ్యి, మూడు గ్రాములు తేనె, 5 గ్రాములు మిరియాల పొడి కానీ యాలుకల పొడిని కానీ వేసి ఈ మిశ్రమాన్ని తీసుకోండి. దీనిని కొద్దిగా కొద్దిగా తీసుకోవడం వల్ల దాహం తీరుతుంది.
బియ్యం పిండి లో తేనె వేసుకుని తీసుకోవడం వల్ల కూడా దాహం తగ్గుతుంది. ఇలా మీకు దాహం ఎక్కువగా వేస్తున్నట్లు అయితే వీటిని తీసుకోండి దాహం పూర్తిగా తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news