రాజ్ కుంద్రా కేసు లో లాయర్ వైరల్ కామెంట్స్..

-

ఒకప్పటి బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా 2021లో అడల్ట్ కంటెంట్ (నీలి చిత్రాలు) కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా ముంబైలో నీలి చిత్రాలను చిత్రీకరించి, వాటిని పంపిణీ చేశారని ఆరోపణలతో అప్పట్లో ముంబై పోలీసులు అతన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన రాజ్ కుంద్రా తరపు న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ప్రముఖ వ్యాపారవేత్త రాజ్కుంద్రా కేసు 2021 లో వైరల్ గా మారింది ఈ కేసు విషయంలో రాసుకుందిరా మూడు నెలలు జైలు శిక్ష కూడా అనుభవించారు బయలు పై విడుదలైన ఈయన ప్రస్తుతం కేసు మాత్రం కోర్టులో నడుస్తూనే ఉంది కాగా ఈ విషయంపై స్పందించిన రాజకుంద్రా న్యాయవాది విచారణ కావాలనే ఆలస్యంగా జరుగుతుందని వేగవంతం చేయమని ఎన్నిసార్లు కోరుతున్న ఆలస్యం చేయటం అర్థం కాని విషయం గా మారిందని చెప్పుకొచ్చారు. ఈ విచారణ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు రాజ్ కుంద్రా లాయర్ ప్రశాంత్ పాటిల్.. ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ ట్రయిల్ జరపాలని కోరుతున్నారు.

అలాగే “నా క్లయింట్ రాజ్ కుంద్రా ఒక తప్పుడు కేసులో బాధితుడు. సంవత్సరాలు గడిచిపోతు

న్నా కోర్టులో విచారణ మాత్రం ఇంకా మొదలుకాలేదు. ట్రయల్ కోర్టు ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, విచారణను ఆలస్యం చేయడానికి ప్రాసిక్యూషన్ ఆసక్తి చూపుతున్నట్టు అనిపిస్తోంది. నిజం అనేది ఏంటో తెలుసుకోకుండా ఇప్పటికే మీడియం అతన్ని దోషిగా చిత్రీకరించింది. పోలీసులు రూపొందించిన ఛార్జ్‌ షీట్‌లో ఉన్న అంశాలనే నిజంగా భావిస్తోంది. నిజానికి నా క్లయింట్ రాజ్ కుంద్రాపై చేసిన ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా లేదు..” అంటూ చెప్పుకొచ్చారు

ఇంకా “న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే రోజువారీ ప్రాతిపదికన విచారణ జరపాలని కోరుతూ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నాం. నా క్లయింట్ మీద ఉన్న ఆరోపణలు రుజువైతే కోర్టు ఆయన్ని శిక్షిస్తుంది. కానీ, నా క్లయింట్ అమాయకుడు, ఏ తప్పూ చేయలేదు అని తేలితే ఆయన మీద ఉన్న తప్పుడు ఆరోపణలన్నీ తుడుచుపెట్టుకుపోతాయి. తీర్పు ఆలస్యమైతే న్యాయం జరగనట్టే. ఇప్పటికైనా కేసు విచారణ మొదలవుతుందని ఆశిస్తున్నాం..” అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version