BREAKING : తెలంగాణ గవర్నర్ తమిళి సై ఇంటికి కరెంట్ కట్

-

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అంధకారంలోకి వెళ్ళింది. నాలుగు రోజులుగా విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగడంతో బిజెపి మరియు అఖిలభారత ఎన్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పుదుచ్చేరి వ్యాప్తంగా కరెంటు సరఫరా నిలిచిపోయింది. అంతే కాదండోయ్ పుదుచ్చేరి సీఎం ఇన్ రంగస్వామి, అలాగే తమిళి సై ఇళ్లకు కూడా కరెంటు కట్ అయింది.

విద్యుత్ పంపిణీ అలాగే రిటైల్ వ్యవస్థలలో 100% ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగ మరియు కార్మిక సంఘాలు ముందు నుంచి తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో మొన్నటి నుంచి విద్యుత్ కార్మికులు సమ్మెకు దిగారు. అయితే మొదటి రోజు ఈ సమ్మె ప్రభావం కనిపించకపోయినా నిన్నటి నుంచి… దీని ప్రభావం ఎక్కువైంది. ఈ తరుణంలోనే పుదుచ్చేరి గవర్నర్ అలాగే సీఎంల ఇంటికి కరెంటు కట్ అయింది. ఇక దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news