టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కింగ్ నాగార్జున గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఈయన మన్మధుడిగా , మాస్ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నాగార్జున అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ని సంపాదించుకోవడం.. అంతేకాదు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ వంటి హీరోలకు గట్టి పోటీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. ఆరు పదుల వయసులో కూడా వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటిస్తూ మంచి విజయంతో దూసుకుపోతున్న నాగార్జున మరొకవైపు బిగ్ బాస్ వంటి రియాల్టీ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు.
సాధారణంగా ఎవరైనా సరే సినీ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ పొందారు అంటే ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిలో ఎంతోమంది సినిమాల నుంచి రాజకీయాలలోకి వెళ్లి సక్సెస్ అయిన వారే ఎక్కువగా ఉండడం గమనార్హం. కానీ నేటితరం హీరోలు హీరోయిన్లు సినిమాలను వదిలి రాజకీయ రంగ ప్రవేశం చేసి సక్సెస్ పొందాలని చూసినా.. అక్కడ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోవడం ఆలోచించదగ్గ విషయమని చెప్పాలి. ఇక ఈ క్రమంలోనే నాగార్జున ఎందుకు రాజకీయాలలోకి వెళ్లడం లేదు అనే వార్త ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.
నిజానికి కమలహాసన్ , రజినీకాంత్ , చిరంజీవి , సౌందర్య లాంటి ఎంతోమంది అగ్ర నటీనటులు రాజకీయ రంగ ప్రవేశం చేసి కొత్త పార్టీలను కూడా ఏర్పాటు చేసి రాజకీయాలలో కూడా చక్రం తిప్పాలని ఆలోచించారు. కానీ ప్రజలు వీరికి అధికారాన్ని అందించలేకపోయారు. దీంతో రాజకీయాలలో విఫలం చెంది మళ్లీ ఇండస్ట్రీకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక అందుకే భయపడి నాగార్జున కూడా ఉన్న పరువును పోగొట్టుకోవడం ఇష్టం లేక రాజకీయాల వైపు ప్రవేశించడం లేదు. ఏదైనా అవసరం ఉంటే వ్యక్తిగతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నాడే తప్ప రాజకీయాలపై ఆయనకు ఆసక్తి లేదని తెలుస్తోంది. ఇండస్ట్రీ నుంచి రాజకీయాలలోకి వెళ్లడం లేదు నాగార్జున.