మా వింత గాథ వినుమా టీజర్: హైదరబాద్ పోరని ప్రేమ కథ..

-

కరోనా లాక్డౌన్ లో రిలీజైన క్రిష్ణ అండ్ హిస్ లీల సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రం ఆహాలో రిలీజై మంచి స్పందన తెచ్చుకుంది. ఐతే మరో కొత్త సినిమాతో ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. మా వింత గాథ వినుమా అనే టైటిల్ తో తెరకెక్కిన చిత్ర టీజర్ ఈరోజే విడుదలైంది. క్రిష్ణ అండ్ హిస్ లీల సినిమాలో సిద్ధు పక్కన నటించిన సీరత్ కపూర్, ఇందులోనూ హీరోయిన్ గా కనిపిస్తుంది.

టీజర్లో చూపించిన ప్రకారం హైదరాబాద్ గల్లీలో తిరిగే పోరగాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్నది చూపించారు. రెస్టారెంట్లో బేరర్ల మీద అరిచే, హాస్టల్ వార్డెన్ కి దమ్కీ ఇచ్చే వాడిలాగా, దోస్తులని ఎట్లపడితే అట్ల తిట్టే వాడిలా సిద్ధు క్యారెక్టర్ ని పరిచయం చేసారు. టీజర్ ఆద్యంతం హైదరాబాదీ యాసతో చాలా కొత్తగా ఉంది. ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 13వ తేదీ నుండి ఆహాలో అందుబాటులో ఉండనుంది. అన్నట్టు మరో విషయం ఈ సినిమాకి కథ అందించింది సిద్ధు జొన్నలగడ్డనే కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news