మాచర్ల నియోజకవర్గం నుంచి.. ‘పోరి సూప‌రో’ అంటూ మాస్ సాంగ్‌ రిలీజ్‌

-

యంగ్‌ అండ్‌ టాలెంటడ్‌ హీరో నితిన్ కథనాయకుడిగా.. అందాల ముద్దుగుమ్మ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. అయితే.. ఈ సినిమాలో నితిన్‌ కలెక్టర్ పాత్ర పోషిస్తున్నారు. ఆదిత్య మూవీస్ &ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎమ్‌.ఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ తెర‌కెక్కించిన ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో మంచి అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన ట్రైల‌ర్‌, పాట‌లల‌కు ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న వ‌చ్చింది. అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఆగ‌స్టు 12న విడుదల కానుంది.

Macherla Niyojakavargam | 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' వీడియో సాంగ్ రిలీజ్‌.. ఆక‌ట్టుకుంటున్న‌ నితిన్ హూక్ స్టెప్స్

ఈ క్ర‌మంలో వ‌రుస అప్‌డేట్‌ల‌తో ప్రేక్ష‌కుల‌లో క్యూరియాసిటీని పెంచుతున్నారు మేకర్స్‌. తాజాగా ఈ చిత్రంలోని ‘పోరి సూప‌రో’ అంటూ సాగే మాస్ బీట్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్. నితిన్, కృతి శెట్టి సిగ్నేచ‌ర్ స్టెప్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. మ‌హ‌తీ స్వ‌ర సాగ‌ర్ స్వ‌ర ప‌రిచిన ఈ పాట‌ను రాహుల్ సిప్లీగంజ్‌, గీతా మాధురీ ఆలిపించారు. కృష్ణ కాంత్ సాహిత్యం అందించాడు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన ‘రారా రెడ్డి’, ‘అదిరిందే’ సాంగ్స్‌కు ప్రేక్ష‌కుల నుండి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా క‌నిపించనున్నాడు.కృతిశెట్టి, క్యాథెరీన్ థ్రెసా హీరోయిన్లుగా న‌టించారు.

Read more RELATED
Recommended to you

Latest news