వైరల్ వీడియో: మహారాష్ట్ర సీఎంకు ఆ స్టార్ హీరోయిన్ శాపం తగిలిందా..?

-

మహారాష్ట్రలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం అస్థిరతతో కొట్టుమిట్టాడుతోంది. ఆయన పదవికి గండం ఏర్పడటంతో ఓ వైపు రాజకీయ నాయకులు వాదోపవాదాలకు దిగుతున్నారు. అయితే తాజాగా ఓ వీడియో వార్త వైరల్ అవుతోంది. ఉద్ధవ్ ఠాక్రేకు ఓ మహిళను ఏడిపించిన ఉసురే వెంటాడుతోందని అంటున్నారు. అదే సీఎం పదవిని కదిలించిందని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

కంగనా రనౌత్-ఉద్ధవ్ ఠాక్రే
కంగనా రనౌత్-ఉద్ధవ్ ఠాక్రే

కొన్నేళ్ల కిందట బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ బీజేపీకి మద్దతుగా.. శివసేన పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసింది. సీఎంతోపాటు ఆయన తనయుడిపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఆ సమయంలో శివసేన కార్యకర్తలు కంగనా రనౌత్‌ను బెదిరించారు. ముంబైలో తనని తిరగనివ్వమని హెచ్చరించారు. అలాగే కంగనా ఎంతో ఇష్టపడి కట్టుకున్న మణికర్ణిక ఆఫీస్ ముంబై మున్సిపల్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కట్టారని కూల్చివేశారు. అప్పుడు కంగనా ఒక వీడియోను విడుదల చేసింది.

ఆ వీడియోలో కంగనా ఎంతో ఎమోషన్ అయింది. చేతిలో అధికారం ఉందని ఇలా చేశావని, ఆ అధికారం ఇంకెన్నో రోజులు ఉండదు.. గుర్తు పెట్టుకోనని కంగనా పేర్కొంది. మహిళలను బాధపెట్టిన ఏ ఒక్కరూ సుఖపడినట్లు చరిత్రలో లేదన్నారు. త్వరలోనే మీ పతనం ఖాయమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news