మహరాష్ట్ర ఎన్నికలు.. ఎన్సీపీ నేత దారుణ హత్య

-

మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న వేళ దారుణం చోటుచేసుకుంది.ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నేత దారుణ హత్యకు గురయ్యారు. బైకుల్లా ఎన్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సచిన్ కుర్మీని గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో పలు మార్లు పొడిచి హత్య చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు.శుక్రవారం అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

సచిన్ మీద దాడి జరిగిన కాసేపటికే పోలీసులకు సమాచారం అందింది.వారు అక్కడకు చేరుకునే సరికి సచిన్ తీవ్రగాయాలతో రక్తపుమడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతన్ని చికిత్స కోసం జేజే ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం ఘటన జరిగిన సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version