ట్విట్టర్​లో రికార్డు బ్రేక్ చేస్తున్న మహేష్​ ఫ్యాన్స్..!

-

ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు సంద‌ర్భంగా ఆయన అభిమానులు ముందుగానే బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ ‘మహేష్ ​బాబు సీడీపీ’ అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటికే ఈ హ్యాష్ ట్యాగ్ 31 మిలియన్ల ట్వీట్స్ మార్క్​ను దాటేసింది. ఆ మ‌ధ్య ఎన్టీఆర్ ఓ రికార్డ్ సృష్టించ‌గా, దానిని బీట్ చేస్తూ  ప‌వ‌న్ అభిమానులు 27 మిలియ‌న్ ట్వీట్స్ చేసి స‌రికొత్త రికార్డ్ నెల‌కొల్పారు. దానిని ఇప్పుడు మ‌హేష్ ఫ్యాన్స్ బ్రేక్ చేశారు.

3 కోట్లకు పైగా ట్వీట్లతో ఇండియా ట్విట్టర్‌ చరిత్రలోనే ఇప్పటి వరకు లేని బిగ్గెస్ట్ ట్రెండ్‌ను మహేష్ బాబు అభిమానులు సృష్టించారు. ఈ ట్రెండ్ కేవలం మహేష్ బాబు బర్త్‌డే కామన్ డిస్ప్లే పిక్ కోసమే. ఇక మహేష్ బాబు బర్త్‌డే (ఆగస్టు 9న) రోజున ఈ ట్వీట్ల రికార్డు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కాగా, ఈ ఏడాది సరిలేరు నికెవ్వరు అంటూ సందడి చేసిన మహేష్ బాబు.. లాక్ డౌన్ కారణంగా ఇంటికి పరిమితమైపోయి ఫ్యామిలీ తో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news