శవారాజకీయం: తండ్రీ కొడుకులిద్దరూ పోటీపడుతున్నారంట!

-

ఏపీలో ప్రజలతరుపున పోరాడటానికి జగన్ పెద్దగా అవకాశం ఇవ్వకపోవడంతో.. జరిగిన ప్రమాధాలనే అవకాశాలుగా మలచుకుంటూ బండి నడిపిస్తున్నారు టీడీపీ నేతలు! వారికి ప్రస్తుతం నదిలో పడి కొట్టుకుపోతున్న చీమకు, ఆకు దొరికినట్లు దొరికింది కరోనా తీవ్రత! ఇందులో భాగంగా… ప్రస్తుతం జగన్ సర్కార్ పై ఏ విమర్శ చేయాలన్నా అది కరోనా కేంద్రంగానే చేయాల్సిన పరిస్థితి! ఈ క్రమంలో… తాజాగా యలవర్తి ఆనంద కిశోర్ అలియాస్ నలంద కిశోర్ మృతికి రాజకీయ రంగు పులిమేసింది టీడీపీ!

అవును… మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత గంటా శ్రీ‌నివాస‌రావు స‌న్నిహితుడు న‌లంద కిశోర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈయన మృతి రాజ‌కీయ రంగు పులుముకుంది. న‌లంద కిశోర్ గుండె పోటుతో మృతి చెందాడ‌ని ఓ పక్క బాధిత కుటుంబ స‌భ్యులు ఇప్ప‌టికే ప్ర‌క‌టించగా.. మృతుడికి అత్యంత స‌న్నిహితుడైన గంటా కూడా దీనిపై ఎలాంటి ఆరోప‌ణ‌లు చేయకపోగా… చంద్ర‌బాబు, లోకేశ్ లు మాత్రం ఈ మరణాన్ని రాజకీయంగా క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారంటూ విమర్శలు వస్తున్నాయి!

ఈ విషయంలో కీబోర్డ్ అందుకున్న బాబు… వైసీపీ వేధింపులు తాళ‌లేకే నలంద కిశోర్ మృతి చెందాడ‌ని ఆరోపించారు. అన్ని విషయాల్లోనూ తండ్రికి మించిన త‌న‌యుడని నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగానో ఏమో కానీ… అనంతరం కీబోర్డ్ అందుకున్న లోకేష్… కిశోర్ ‌ది ముమ్మాటికీ ప్ర‌భుత్వ హ‌త్యేన‌ని తనదైన శైలిలో తేల్చి పారేశారు! కిరోశ్ మృతికి ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేసేశారు.

ఒక వ్యక్తి మరణించాడంటే…ఈ లోకాన్ని వీడాడంటే… అది ఎవరికైనా బాదే! కానీ… ప్రతీ చావునీ రాజకీయంగా వాడుకోవాలనుకోవడం మాత్రం.. అంతకు మించిన ఆలోచనా విధానం అనే భావించాలి! మరీ ఈ విషయంలో తండ్రీ కొడుకులిద్దరూ పోటీపడి మరీ ఇలాంటి పనులకు పూనుకోవడాన్ని ఏమనాలి.. ఎలా చూడాలి! కుటుంబ సభ్యులే అసలు కారణం ఇది అని చెబుతుంటే… దాన్ని ప్రభుత్వానికి ఆపాదించి ఆనందించాలనుకోవడం ఏమిటని ఈ సందర్భంగా పలువురు ప్రశ్నిస్తున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news