తెలంగాణలో రూ.వెయ్యికోట్ల పెట్టుబడులతో మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ

-

తెలంగాణ మొబిలిటీ వ్యాలీ లక్ష్యాలకు అనుగుణంగాభారతదేశంలో సస్టెయినబుల్‌ మొబిలీ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ మొబిలిటీ వ్యాలీ లక్ష్యాలకు అనుగుణంగా ఇవాళ మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీతో ఎంఓయూ కుదిరిందని ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణలో మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ రూ.వెయ్యికోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. జహీరాబాద్‌లో ఉన్న ప్లాంట్‌కి అనుబంధంగా లాస్ట్ మైల్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో గురువారం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.

తెలంగాణలో మహీంద్రా అండ్‌ మహీంద్రా రూ.వెయ్యికోట్ల పెట్టుబడి

ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొబిలిటీ వ్యాలీ ప్రకటన తర్వాత జరిగిన చర్చల్లో భాగంగా మహీంద్రా కంపెనీ వెల్లడించింది. రూ.వెయ్యికోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌తో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశం లభించనున్నది. భవిష్యత్‌లో కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్‌ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం తయారీ యూనిట్లను ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నాలుగు మెగా ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో జహీరాబాద్ ఒకటని, మహీంద్రా అండ్ మహీంద్రా అత్యున్నత ప్రమాణాలతో కూడిన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు స్థానికంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్కారుతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్‌ జేజురికర్ హర్షం వ్యక్తం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news