Hari Hara Veera Mallu : ‘హరిహర వీరమల్లు’ నుంచి మేకింగ్ వీడియో రిలీజ్..

-

భీమ్లా నాయక్ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు “హరిహర వీరమల్లు” అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” అనే పీరియాడికల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.ఇంతకుముందు నటసింహం నందమూరిి బాలకృష్ణ తో గౌతమీపుత్ర శాతకర్ణి వంటి హిస్టారికల్ మూవీ రూపొందించిన క్రిష్ ఆ అనుభవంతో ఈ సారి కూడా హరిహర వీరమల్లు లో 17వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్యం నేపథ్యాన్ని ఎంచుకున్నారు.ఇందులో మొగల్ పాలకులకు ముచ్చెమటలు పట్టించిన వీరుడు ” హరిహర వీరమల్లు” గా పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. అందుకోసం ఆయన పోరాట సన్నివేశాలుఅందుకోసం ఆయన పోరాట సన్నివేశాల సాధన చేశారు. అప్పుడు తీసిన వీడియో నే ఇప్పుడు ఇలా సందడి చేస్తోంది.

 

హరిహర వీరమల్లు కు సంబంధించిన స్టిల్స్ కొన్ని ఇటీవల హల్ చల్ చేశాయి. తాజాగా సదరు పిక్స్ లోని యాక్షన్ మూమెంట్స్ తో ఓ వీడియో ని విడుదల చేశారు చిత్ర యూనిట్. పవన్ కళ్యాణ్ ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ” ది వారియర్స్ వే” పేరుతో చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఈచిత్రంలో పవర్ స్టార్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు..ఈ ఒక్క బిట్టు తోనే ఇంతలో ఆకట్టుకుంటున్న హరిహర వీరమల్లు సినిమా థియేటర్లో ఏ విధంగా అలరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news