Ram Charan : సిద్ధయోగి ‘చిరుత’ చూపులు..‘ఆచార్య’లో రామ్ చరణ్ హైలైట్!

-

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR చిత్రంలో తన నట విశ్వరూపం చూపారని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డిఫరెంట్ వేరియేషన్స్, లేయర్స్ ఉన్న రామరాజు పాత్రను రామ్ చరణ్ చాలా బాగా పోషించారని సినీ ప్రముఖులు కూడా అంటున్నారు. ఇక ఈ పిక్చర్ తో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఆ సినిమా ఆయనలోని మరోకోణాన్ని ఆవిష్కరిస్తుందని సినీ పరిశీలకులు అంచనా వేస్తు్న్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాలన్నీ ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. కథ పరంగా ఆయన చేసే కాన్సంట్రేషన్ బాక్సాఫీసును షేక్ చేస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలోనే స్టోరిలో ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ చాలా బాగా కుదిరిందన్న వార్త చాలా కాలం నుంచి వినబడుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో రామ్ చరణ్ పాత్ర పరిచయం అయింది కూడా. కాగా, తాజాగా విడుదలైన ట్రైలర్ రిలీజ్ డేట్ పోస్టర్ లో రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది.

ఇంటెన్స్ లుక్ లో ఉన్న చరణ్ కళ్లు, గడ్డం చేతిలో తుపాకి అడవి బాటలో రామ్ చరణ్ నడుస్తున్న తీరు చూసి మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘చిరుత’ పులి మాదిరిగా రామ్ చరణ్ చూపులు ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘ధరస్థలికి ఆపద వస్తే అది జయించడానికి అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకు పంపుతుంది’ అని రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ విని మెగా అభిమానులు ఆనందపడిపోయారు.

ఇక పూజా హెగ్డే- రామ్ చరణ్ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ పైన ఎక్సలెంట్ గా ఉండబోతుందని అంటున్నారు. ‘సిద్ధ’ యోగి మాదిరిగా రామ్ చరణ్ ఈ చిత్రానికి ఇన్ స్పిరేషన్ రోల్ చరణ్ దే మెగా అభిమానులు అంటున్నారు. మొత్తంగా ‘సిద్ధ, ఆచార్య’.. ఇద్దరి కోసం మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. తండ్రీ తనయులు చిరంజీవి, రామ్ చరణ్ లను వెండితెరపైన చూసి కన్నుల పండువగా సినిమాను సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news