నా అంత అదృష్టవంతుడు ఎవరు లేరు – మంత్రి మల్లా రెడ్డి

-

నా అంత అదృష్టవంతుడు ఎవడు లేడని తెలంగాణ మంత్రి మల్లా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కల కన్నా.. నిజo చేసుకున్న.. నా అంత అదృష్టవంతుడు ఎవరు లేరన్నారు. ఇవాళ కాలేజీ కార్యక్రమంలో మంత్రి మల్లా రెడ్డి మాట్లాడారు. బర్త్ డే లు పిక్నిక్స్ ఉండొద్దని.. పిల్లలను పాడు చేసేది పేరెంట్స్ అని ఫైర్‌ అయ్యారు.


కొన్ని సాధించాలి అంటే కొన్నింటికి దూరం ఉండాలని కోరారు. ప్రేమ.. ఫ్రెండ్షిప్ అన్నిటికీ దూరం ఉండాలని.. నేను ఏది దాచుకోనని చెప్పారు మల్లారెడ్డి. భూమి అమ్మి కొడుకును ఎంబీబీఎస్ చేపించానని.. ఎంపీ…ఎమ్మెల్యే.. మంత్రి అయ్యానని పేర్కొన్నారు.

నాకు ఎలాంటి కోరికలు లేవన్నారు మంత్రి మల్లా రెడ్డి. ఒక డాక్టర్ ను చడివిపిస్తే కోడలుగా మరో డాక్టర్ గిఫ్ట్ గా వచ్చిందని.. రెడ్డి అమ్మాయిని చేసుకుంటే కిట్టి పార్టీలు… పిక్నిక్ లు వెళ్ళేదన్నారు. నా కోడలు కు అమ్మ నాన్న లేరు.. నాకు కోడలు మూడో కొడుకు లాగా అని ఎమోషనల్‌ అయ్యారు. ఐటీ రైడ్ చేశారు.. నేను భయపడలేదు.. 400 మంది వచ్చారు.. వాళ్ల పని వాళ్ళు చేసుకుని వెళ్లారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news