టీఆర్ఎస్,బీజేపీ లకు ప్రతి ఘటన తప్పదు : మల్లు రవి

-

ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఇటీవల తెలంగాణాలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో.. వ‌రంగ‌ల్ రైతు సంఘర్ష‌ణ స‌భ‌లో రాహుల్ గాంధీ ఓ డిక్ల‌రేష‌న్‌ను ప్ర‌క‌టింరు. దీంతో ఈ డిక్లరేషన్ పై టీఆర్ఎస్‌, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్బంగా టీపీసీసీ ఉపాధ్య‌క్షుడు మ‌ల్లు ర‌వి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ డిక్లరేషన్ ప్రకటిస్తే.. టీఆర్ఎస్‌, బీజేపీల‌కు ఉలిక్కిపాటు ఎందుక‌ని ప్ర‌శ్నించారు. సోమ‌వారం గాంధీ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడిన మాల్ రవి.. కాంగ్రెస్ పార్టీ డిక్ల‌రేష‌న్‌పై రైతులు సంతోషంగా ఉన్నార‌న్నారు.

Mallu Ravi flays Rajagopal's remarks on Congress

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిక్ల‌రేష‌న్‌ను అమ‌లు చేస్తుంద‌న్న న‌మ్మ‌కం రాష్ట్ర ప్ర‌జ‌ల్లో నెలకొంద‌ని మల్లు రవి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీపై టీఆర్ఎస్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను ప్ర‌జ‌లు హ‌ర్షించ‌డం లేద‌న్నారు మ‌ల్లు ర‌వి. రాహుల్ గాంధీపై టీఆర్ఎస్‌తో పాటు బీజేపీలు విమ‌ర్శ‌లు మానుకోక‌పోతే ఆ రెండు పార్టీల‌కు ప్ర‌జ‌ల నుంచి ప్ర‌తిఘ‌ట‌న త‌ప్ప‌ద‌ని మల్లు రవి హెచ్చ‌రించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌ను ప్ర‌జ‌లు గ‌ద్దె దింపుతార‌ని, టీఆర్ఎస్‌, బీజేపీలు కుమ్మ‌క్కు రాజ‌కీయాలు చేస్తున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు మల్లు రవి.

Read more RELATED
Recommended to you

Latest news