గూగుల్‌పే యూజర్ల ఖాతాల్లోకి రూ.81 వేలు

-

ఇప్పుడంతా డిజిటల్‌ పేమెంట్స్‌దే హవా.క్షణాల్లో చెల్లింపులు ఎలా జరుగుతున్నాయో చెప్పనవసరం లేదు. ఇతరులకు నగదు బదిలీ కూడా కన్నుమూసి తెరిచేలోపు అయిపోతాయి. ఫోన్ యాప్‌ ఆధారిత పేమెంట్స్‌పై రివార్డు పాయింట్లు, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు కూడా వస్తాయి. గతంలో సెర్చింజన్‌ గూగుల్‌ అనుబంధ పేమెంట్‌ యాప్‌ గూగుల్‌ పేలో భారీ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు ఉండేవి. కానీ, ఇప్పుడు చాలా మందికి ‘బెటర్‌ లక్‌ నెక్ట్స్‌ టైం’ అనే మెసేజ్‌ వస్తే చాల భాదగా ఉంటుంది. అయితే, సాంకేతిక లోపం కారణంగా `మై రివార్డ్స్` విభాగంలో క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్ల ఓచర్లు స్క్రాచ్‌ చేసిన యూజర్ల ఖాతాల్లోకి రూ.81 వేల చొప్పున క్రెడిట్‌ అయ్యాయి. ఈ సంఘటన అమెరికాలో జరిగింది.

Google Pay - Learn What the Google Pay App Is & How To Use It

జి-పేలో లోపం వల్ల అమెరికాలోని పిక్సెల్‌ ఫోన్‌ యూజర్లకు భారీగా క్యాష్‌బ్యాక్‌లు వచ్చాయి. 10 డాలర్ల నుంచి 1000 డాలర్ల వరకు క్యాష్‌ క్రెడిట్‌ కావడంతో కొందరు నెటిజన్లు రెడిట్‌ అనే ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లో పోస్టులు పెట్టారు. ఒకవ్యక్తి 16 లావాదేవీల్లో 10 ట్రాన్సాక్షన్స్‌కు క్యాష్‌బ్యాక్‌ వచ్చిందని పేర్కొన్నాడు. కొందరు తమకు 100 డాలర్లు వచ్చాయంటే.. ఒక యూజర్‌ తనకు 240 డాలర్లు క్యాష్‌బ్యాక్‌ అయ్యాయని, మరో యూజర్‌ ఏకంగా 1072 డాలర్లు వచ్చాయని ఒక పోస్ట్ ద్వారా తెలిపాడు. మన కరెన్సీలో రూ.800 నుంచి రూ.80 వేల పైమాటే మరి. దీంతో పలువురు నెటిజన్లు తమ సంతోషాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు.
ఈ సంగతి సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కొందరు గూగుల్‌ పే ఖాతాదారులు తమ లక్‌ చెక్‌ చేసుకున్నారు. వెంటనే గూగుల్‌ ఆశ్చర్యపోయింది. తన గూగుల్‌పే యాప్‌లో లోపాన్ని సరి చేసింది. యాప్‌లో టెక్నికల్‌ మార్పులు చేస్తున్నప్పుడు ఈ లావాదేవీలు జరిగినట్లు సమాచారం. గూగుల్‌ పే తన ఖాతాదారుల నుంచి క్యాష్‌బ్యాక్‌ డబ్బు వెనక్కు తీసేసుకున్నట్లు తెలుస్తున్నది. నిధులు ఇతరులకు బదిలీ చేసిన వారి విషయంలో ఏం చేయలేదని సమాచారం.

 

 

Read more RELATED
Recommended to you

Latest news