కరోనా వైరస్ ని ఏ విధంగా అయినా కట్టడి చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు తాజాగా మరో సంచలన ప్రకటన చేసారు. కరోనా వైరస్ కట్టడి చెయ్యాలి అంటే ఆదివారం, అంటే ఈ నెల 22 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు.
చాలా మంది ఆ ఒక్క రోజు జనతా కర్ఫ్యూ పాటిస్తే కరోనా తగ్గుతుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. కాని దాని ఉద్దేశం మాత్రం చాలా గొప్పది అంటున్నారు నిపుణులు. ఒక ప్రదేశంలోని కరోనా వైరస్ జీవితం 12 గంటలు. ఆ తర్వాత అది చచ్చిపోతుంది. ఎక్కడ ఉన్నా సరే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే వైరస్ చచ్చిపోతుంది. జనతా కర్ఫ్యూ 14 గంటలుగా ప్రభుత్వం ప్రకటించింది. 14 గం.ల తరువాత ఆ ప్రాంతం కరోనా వైరస్ లేని ప్రాంతాలుగా మారతాయి.
14 గంటల తర్వాత ఆ ప్రదేశాలు తాకినా కరోనా వైరస్ అంటుకోదని చెప్తున్నారు. 14 గంటలు ఇంట్లో ఉండటం చేత కరోణ వ్యాపించే లింకును ఛేధిస్తున్నా౦. అప్పటికే కరోనా సోకిన వారిని గుర్తించి ఏకాంత వైద్య శిబిరాలకు చేరుస్తుంది ప్రభుత్వం. కాబట్టి, మిగిలిన దేశమంతా వైరస్ బారిన పడకుండా క్షేమంగా ఉంటుంది అనేది ప్రభుత్వం భావన. ఇక్కడ మనలోకం మీకు ఇచ్చే సలహా ఒకటే. అర్ధం చేసుకున్న వాళ్ళు అర్ధం చేసుకోండి. అనవసరంగా బయటకు వెళ్ళవద్దు.
ప్రభుత్వ ఆలోచనను అర్ధం చేసుకోండి. అనవసరంగా బయటకు వచ్చి మీ ప్రాణాలతో పాటు ఇతరుల ఆరోగ్యాన్ని కూడా ఇబ్బంది పెట్టవద్దు. కరోనా వైరస్ ఒకరి నుంచి 19 మందికి సోకుతుంది. కాబట్టి అర్ధం చేసుకుని… సహకరించండి. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే బయటకు వస్తారా చెప్పండి…? ఆ రోజు కూడా ఫంక్షన్ అనుకుని సంతోషంగా కుటుంబ సభ్యులతో రోజు అంతా గడపండి. దయ చేసి ప్రజల ప్రాణాలను ఇబ్బంది పెట్టవద్దని మనలోకం కోరుతుంది.