అలా చేసి మరోసారి మానవత్వాన్ని చాటుకున్న మంచు లక్ష్మీ..!!

-

మంచు లక్ష్మీ.. ఈమె పుట్టింది ఆంధ్రప్రదేశ్లో అయినా పెరిగింది మాత్రం విదేశాలలో కారణంగా తన ఇంగ్లీష్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుందని అందరికీ తెలిసింది. అయినా కూడా ఈమె ఇచ్చే స్పీచ్ లతో విపరీతమైన ట్రోల్స్ కి, నెగిటివ్ కామెంట్స్ కి గురి అయినప్పటికీ తన మానవత్వంతో మంచి మనసుతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా తండ్రికి తగ్గ తనయురాలిగా గుర్తింపు తెచ్చుకుంటుంది మంచు లక్ష్మి. అలాగే టెక్ ఫర్ చేంజ్ అనే కార్యక్రమంతో టీచర్స్ లేని పాఠశాలల్లో పాఠాలు కూడా చెప్పేస్తుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇక తాజాగా మరో మంచి పనికి సిద్ధమయింది ఈ ముద్దుగుమ్మ.

తెలంగాణ నిర్వహిస్తున్న మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా మంచు లక్ష్మి ఏకంగా 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో 50 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని కూడా ఆమె హామీ ఇచ్చింది. యాదాద్రి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో టెక్ ఫర్ చేంజ్ సంస్థతో 50 స్కూలు దత్తత తీసుకుంటున్నాను అని ఒప్పందం చేసుకుంది. అంతేకాదు ప్రైవేట్ పాఠశాలలను మరిపించేలా స్మార్ట్ క్లాసెస్ ప్రారంభిస్తామని ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు మూడు సంవత్సరాల పాటు స్మార్ట్ క్లాసెస్ నిర్వహిస్తూనే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తామని, ఆ స్కూల్స్ లో కనీస అవసరాలు కూడా ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపింది.

ఇక మంచు లక్ష్మి చేస్తున్న మంచి పనికి నెటిజెన్లు సైతం ఆమెను మెచ్చుకుంటున్నారు. అంతేకాదు శభాష్ మేడం అంటూ.. మీలాంటి వ్యక్తులు మన సమాజానికి కావాలి అంటూ ఇలా రకరకాలుగా ఆమెపై ప్రశంసలు వర్షం కురిపిస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికి అయితే మరొకసారి మానవత్వాన్ని చాటుకొని తండ్రికి తగ్గ కూతురుగా గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మి.

Read more RELATED
Recommended to you

Latest news