మంచు మనోజ్ భూమా మౌనిక పెళ్లి డేట్ ఫిక్స్!

-

టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మంచు మనోజ్. యూత్ ఫుల్ ఎంటర్టైనర్, లవ్ స్టోరీ లతో మంచి హిట్స్ సంపాదించుకున్నాడు. కొన్నాళ్లు కెరియర్ మంచిగానే నడిచినప్పటికీ తర్వాత మాత్రం అనుకున్న స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయాడు. ప్రస్తుతం మంచు మనోజ్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. కారణం భూమా మౌనికతో పెళ్లిపై వస్తున్న వార్తలే. అయితే తాజాగా వీరిద్దరికీ పెళ్లి కుదిరింది అనే వార్తలు వినిపిస్తుండగా పెళ్లి డేట్ కూడా ఎప్పుడో తెలుస్తోంది.

 

బాల నటుడుగా తన కెరీర్ ను మొదలుపెట్టిన మంచు మనోజ్ పదేళ్ల వయసులోనే మేజర్ చంద్రకాంత్ చిత్రంలో నటించాడు. తర్వాత హీరోగా నిలదొక్కుకున్నారు. 2004లో వచ్చిన దొంగ దొంగది చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు.. అనంతరం హీరోగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ పలు సినిమాల్లో నటించాడు. బిందాస్, ఝుమ్మంది నాదం, మిస్టర్ నూకయ్య, రాజు భాయ్, పాండవులు వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు.

అయితే మంచు మనోజ్ 2015 లో ప్రణతి రెడ్డి ని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి ప్రేమ వివాహమని కొందరు అంటుంటే మంచు మనోజ్ వదిన విరానికా క్లాస్మేట్ ప్రణతి రెడ్డి అని కొందరి వాదన. ఏది ఏమైనా వీరిద్దరూ పెళ్లి చేసుకుని కొన్నాళ్లపాటు జీవితాన్ని ఆనందంగానే గడిపారు. ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. అనంతరం మనోజ్ మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ కూడా పలమార్లు చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం మంచు మనోజ్ భూమా మౌనికను పెళ్లి చేసుకోనున్నట్టు సమాచారం.

గత కొంతకాలంగా భూమా మౌనిక మనోజ్ రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గణేష్ ఉత్సవాల సందర్భంగా వీరిద్దరూ జంటగా కనిపించారు. అప్పటినుంచి వీరు రిలేషన్ లో ఉన్నారని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ దీనిపై ఇప్పటివరకు మంచు ఫ్యామిలీ కానీ మౌనిక ఫ్యామిలీ గాని ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వీరిద్దరూ కూడా ఎప్పుడు వాళ్ళ ప్రేమను నేరుగా వ్యక్తపరచలేదు. కానీ ఇప్పటికే పలమార్లు మనోజ్ మాత్రం అన్ని విషయాలు తొందరలోనే చెబుతా అంటూ చెప్పుకొచ్చారు.

కాగా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి 3న మనోజ్ భూమా మౌనిక మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు కూడా జరిగిపోతున్నట్టు తెలుస్తోంది. అయితే అసలు విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news