సీఎం రేవంత్ రెడ్డి పై మందకృష్ణ మాదిగ ఫైర్..!

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం రేవంత రెడ్డి పై మందకృష్ణ మాదిగ ఫైర్ అవుతున్నారు. ఎన్నికలకు ముందు బీజేపీకి మద్దతు ఇచ్చిన ఆయన కాంగ్రెస్ పై కాస్త గుర్రుగానే ఉన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు అన్యాయం జరిగిందని పేర్కొన్న విషయం తెలిసిందే.

తాజాగా ఆయన స్పందిస్తూ.. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా మాదిగలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మందకృష్ణ మాదిగా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికి పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు ఎందుకు గెలుచుకోలేక పోయిందో చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. తమకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి తగిన రుణం తీర్చుకుంటామని తేల్చి చెప్పారు. అలాగే మాదిగల విషయంలో కాంగ్రెస్ పార్టీ పద్ధతి మార్చుకోకపోతే పార్టీనే ఉండదని.. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగలేరని మందకృష్ణ మాదిగ తేల్చి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news