ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన మండలి రద్దు నిర్ణయాన్ని జగన్ ఈరోజు తీసుకోవటంతో ఇదే రోజు తీవ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా తో పాటు ఢిల్లీ స్థాయిలో కూడా విమర్శలు వినబడుతున్నాయి. తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జగన్ తన తండ్రి తీసుకువచ్చిన శాసనమండలిని రద్దు చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైఎస్ అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు అదే విధంగా జాతీయ స్థాయిలో కూడా ఈ విషయం పెద్దది కావడంతో శాసన మండలి రద్దు నిర్ణయాన్ని జగన్ తీసుకోవడం పట్ల కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా తీవ్రస్థాయిలో మండి పడుతున్నట్లు సమాచారం.
దీంతో శాసన మండలి రద్దు బిల్లు..కేంద్రం దగ్గరకు వచ్చే అవకాశం ఉన్న క్రమంలో..జగన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు కేంద్ర పెద్దలు …శాసన మండలి రద్దు బిల్లు విషయంలో సరికొత్త ఆలోచన చేయబోతున్నట్లు సమాచారం.
పెద్దలు మరియు మేధావులు చట్ట సభలో ప్రభుత్వ విధానాలకు సలహాలు ఇచ్చే విధంగా అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004వ సంవత్సరంలో గెలిచిన సమయంలో శాసనమండలిని పునరుద్ధరించారు. అయితే తాజాగా వైయస్ జగన్ తన స్వార్ధ రాజకీయాలకోసం తన తండ్రి తెచ్చిన శాసనమండలిని రద్దు చేయడం ఏంటి అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు…జగన్ వ్యవహారశైలిపై మండిపడుతున్నారు.