ఈ సీజన్‌లో ఉదయం లేవగానే.. రాత్రి బయట ఉన్న వస్తువులపై మంచు బిందువులు ఉంటాయి..మీరు చూసే ఉంటారు. బైక్స్ మీద ఎక్కువగా ఉంటాయి.. అదే పల్లెటూర్లలో అయితే.. పచ్చనిగడ్డిమీద బాగా ఉంటాయి.. అలా వాటిని చూస్తుంటే.. భలే హాయిగా ఉంటుంది.. మంచు బిందువుల పడిన గడ్డిమీద నడవటం వల్ల చాలా మంచిదట..కానీ సిటీల్లో ఉండేవారికి ఆ ఛాన్స్ లేదు.. అయితే సిటీల్లో కూడా మంచుపడుతుంది.. ఈ నీటి బిందువుల వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఓసారి చూద్దామా..!
మంచు బిందువులతో ఉపయోగాలు:
రోజంతా పని చేసి శరీరం అలసిపోతుంది. అలాంటి సమయంలో ఉదయాన్నే సేకరించిన మంచు నీటిని తాగితే ఉపశమనం కలుగుతుంది. ఇది శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. మళ్లీ యాక్టివ్‌గా పనులు చేసుకునేందుకు దోహపడుతుంది. శరీరం నుంచి మలినాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా వైరస్, బ్యాక్టీరియా వల్ల ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చు.
జిడ్డు చుర్మంతో ఇబ్బంది పడేవారు…ఉదయం పూట కురిసే మంచు బిందువులను ముఖంపై వేసుకొని.. మర్దన చేస్తే.. మంచి ఫలితాలు ఉంటాయి. జిడ్డు తొలగిపోయి.. చర్మం కాంతిగా మారుతుంది.
ఒక పరిశోధన ప్రకారం… రోజూ ఉదయం పూట మంచు నీటిని తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా గుండె జబ్బులు, కార్డియాక్ అరెస్ట్ వంటి ప్రమాదాన్ని కూడా నివారించవచ్చు.
ఉదయం పూట కురిసే మంచులో 14-16 ppm వరకు ఆక్సిజన్ పుష్కలంగా ఉంటుంది. ఒక పాత్రలో ఆ మంచు బిందువులను సేకరించి ముఖానికి రాసుకుంటే చర్మానికి చాలా ప్రయోజనంగా ఉంటుందట.. మొటిమలు, మచ్చల సమస్యలు తొలగిపోతాయి. మీకు ఇప్పటికే మొటిమలు ఉంటే చర్మంపై ముఖంపై మంచు నీటిని స్ప్రే చేసుకోవాలి. తాగినా మంచి ఫలితాలు వస్తాయి. సేకరించటం ఎలా అని మీకు డౌట్ రావొచ్చు.. నైటే ఒక గిన్నెలాంటిది బయట పెడితే.. ఉదయానికి దానిపై మంచుపడి బిందువులు ఏర్పడతాయి.. దాన్ని డైరెక్టుగా ముఖానికి రాసుకుంటే సరి.. !
బరువును తగ్గించడంలోనూ ఈ నీరు ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీరు బరువు ఎక్కువగా ఉన్నట్లయితే… సరైన ఆహారం తింటూ, వ్యాయామం చేయడంతో పాటు మంచు నీటిని కూడా తీసుకోవడం అలవాటు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి…
ఉదయం నిద్రలేచిన తర్వాత మీ కళ్ళు ఎర్రగా కనిపిస్తే… కొన్ని చుక్కల మంచు నీటిని వేసుకోవాలి. దీని వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉండడంతోపాటు కంటిచూపు కూడా పెరుగుతుంది. అప్పటికప్పుడు మంచు నీరు దొరకడం కష్టమయితే.. దొరికినప్పుడు ఆ మంచు బిందువులన సేకరించి.. స్టోర్ చేసి పెట్టుకోవచ్చట..