మహిళలంటే సున్నితస్తులు అని చాలామంది అనుకుంటారు. అవును వాళ్లలో చాలమంది అలానే ఉంటారు. కానీ కొందరు మాత్రం పూర్తి భిన్నంగా ఉంటారు. ఒక సాధారణ మహిళ 102 మందిని చంపేసింది. ఇద్దరు ముగ్గుర్ని చంపితేనే హంతుకుడు, రౌడీ, దుర్మార్గుడు అంటారు. అతనితో మాట్లాడినికి కాదుకదా..కనీసం చూడటానికి సామన్యజనం బెంబేలెత్తిపోతుంటారు. అయితే ఇది జరిగింది ఇప్పుడు కాదు…కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయమే.. కానీ ఓ మహిళ ఇంతమందిని ఎలా చంపింది, ఎందుకు చంపిదో, అసలు ఎలా సాధ్యమైంది ఇదంతా అనే ప్రశ్నలు వస్తున్నాయ్ కదా..చూద్దాం ఏం చేసిందో.
ఈ క్రైమ్ కథలో విలన్ పేరు అదే ఈ మహిళ పేరు..మారియా కేథరినా స్వానెన్‌బర్గ్ సంపన్నదేశమైన నెదర్లాండ్స్‌లోని సౌత్ హోల్లాండ్లో ఉన్న లీడెన్‌లో 1839 సెప్టెంబర్ 9న పుట్టింది. చాలా తెలివైనదట. 1880-1883 లోనే ఈ స్థాయిలో మర్డర్లు చేసిందంటే ఆమె ఎంత దారుణమైనదో ఊహించుకోవచ్చు.
క్లెమెన్స్ స్వానెన్‌బర్గ్, జొహన్నా డింగ్జాన్ల ముద్దుల కూతురు ఈ మారియా. చిన్నప్పటి నుంచే స్వతంత్రంగా ఉండటం అంటే ఇష్టం. కాస్త మొండిఘటం..ఆ కాలంలో అందరూ 17 ఏళ్లకే పెళ్లిచేసుకునేవారు..మనకు తెలుసుకదా అప్పట్లో బాల్యవిహాహాలు ఎక్కువే అని..కానీ మారియా మాత్రం 29 ఏళ్లు వచ్చే వరకూ పెళ్లిచేసుకోలేదు. 1868 మే 13న మారియా పెళ్లి చేసుకుంది. అంతే ఏడుగురు సంతానం కలిగింది. అయినా తనకు తన జీవితం నచ్చేదికాదు..ఏంటి పిల్లలను కనే యంత్రంలా మారిపోయాను అనే భావన తనలో ఏర్పడింది. దీనికి తోడు భర్త తనను అదుపులో ఉండాలి అనే మాటల..అది అస్సలు నచ్చేది కాదు మారియాకు. ఇదే విషయం పై భార్యభర్తలకు మధ్య చాలా గొడవలు జరిగేవట.
ఈ క్రమంలోనే 18 ఏళ్లు గడిచాయి. 1886 జనవరి 29న మారియా తన భర్తకు విడాకులిచ్చింది. దాంతో ఆ పిల్లల బాధ్యత అంతా తన నెత్తినే పడింది. తల్లిదండ్రుల మాట వినకుండా మారియా విడాకులు ఇవ్వటంతో ఆమెను వారు దూరం పెట్టారు. ఒంటరిదైన మారియాకు ఏం చేయాలో తోచలేదు. తాను పుట్టిన లీడెన్కి పక్కనే ఉన్న ఓ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ అనారోగ్యంతో బాధపడేవారిని చూసుకునే పనిలో చేరింది. ఇటు పిల్లలు, అటు రోగులు… ఇలా ఆమెకు జీవితంలో మనస్శాంతి లేకుండా పోయింది.
క్రమంగా నేరప్రవృత్తి:
ఇలా జీవితంపై విరక్తి చెందిన మారియా క్రమంగా నేరవృత్తిలోకి దిగింది. ఈ పిల్లలేంటి, ఈ రోగులేంటి వీళ్లందరికిని నేను చూసుకోవటం ఏంటి అనుకుంది..ఈ మనోవిశ్షేషణ నుంచే కోపం, ఆగ్రహం, కసి ఇలా రకరకాల భావాలు పుట్టుకొచ్చాయి. ఫైనల్ గా తనకు మనుషులంటేనే విరక్తి కలిగింది. అసలు ఈ మనుషులందరిని చంపేయాలని ఫిక్స్ అయింది. ఇక్కడే ఓ ప్లాన్ వేసింది మారియా. మనుషులు చావాలి..కానీ ఆ నేర తనపైకి రాకూడదు..అదే పాము చావాలి కర్రవిరగకూడదు అంటారు కదా అదే టైప్. చచ్చిన వారి ద్వారా డబ్బు రావాలి అని పన్నాగం పన్నింది.
అనుకన్నట్లే అమలు
తాను చూసుకునే రోగులకు లైఫ్ ఇన్సూరెన్స్ చేయించింది. ఆ తర్వాత వాళ్లను అప్పుడప్పుడూ ఒక్కొక్కరినీ చంపేయటం ప్రారంభించింది.. అలా చనిపోయే వాళ్ల పేరుమీద ఉండే ఇన్సూరెన్స్ క్లెయిమ్ డబ్బును తాను తీసుకునేది. లేదా వారి ఆస్తులు, నగలు ఉంటే వాటిని తానే తీసుకునేది. ఇది ఎలా సాధ్యమైందంటే… చాలా మంది రోగులకు సొంతవాళ్లు ఎవరూ ఉండేవారు కాదు. కొంత మంది కావాలనే ముసలివాళ్లను ఆమెకు అప్పగించి వదిలించుకునేవారు. ఇలాంటి చాలా మంది ఆమె దగ్గర ఉంటూ రకరకాల రోగాలతో బాధపడుతూ ఉండేవారు. వాళ్లను అప్పగించేవాళ్లు ఇచ్చే డబ్బుతో మారియా వాళ్లను పోషించేది. వాళ్లు చచ్చిపోయాక వచ్చే డబ్బును దాచుకునేది. ఇలా మారియా దగ్గర ఉంటున్న వాళ్లు ఒక్కొక్కరుగా చనిపోతున్నా రోగాల వల్ల పోతున్నారు అనుకున్నారు పోలీసులు, చుట్టుపక్కలవాళ్లూ.
మారియా ఇదే క్రమంలో తనను దూరం చేసుకున్న తల్లిదండ్రులపైనా పగ పెంచుకుంది. ముందుగా వాళ్లనే చంపింది. తల్లిదండ్రుల పేరున అప్పటికే..లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. దాంతో ముందుగా తల్లిని చంపింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తండ్రిని చంపింది. ఆ తర్వాత రోగుల జోలికి వచ్చింది. పేరెంట్స్‌ని చంపేశాక… ఆస్తి మొత్తం తన పేరున రాయించుకుంది. వాళ్ల పేరున ఉన్న ఇన్సూరెన్స్ మొత్తం తీసుకుంది. ఆ తర్వాత రోగుల్ని చంపుతూ వచ్చింది. ఎలా చంపేదంటే… అత్యంత విషపూరితమైన ఆర్సెనిక్ పాయిజెన్ ఇచ్చేది. ఏ కూల్డ్రింకులోనో, ఆహారంలోనో కలిపి రోగులకు ఇచ్చేది. కొంత మందికి ఇంజెక్షన్ రూపంలో కూడా ఇచ్చేది. ఇది తాగిన వాళ్లు త్వరగానే చనిపోతారు. అయితే ఆ రోజుల్లో పోస్ట్‌మార్టంలో ఈ పాయిజన్ కలిపినట్లు తెలిసేది కాదు. అంత టెక్నాలజీ అప్పట్లో లేదు కాబట్టి..అన్నీ సహజమరణాలుగానే భావించేవారు. పైగా ముసలివారినీ, రోగాలు ఎక్కువగా ఉన్నవారిని ఎంచుకొని చంపేది అందువల్ల ఎవరికీ అనుమానం రాలేదు.
ఎలా పట్టుబడిందంటే..
ఫ్రాఖుజెన్ ఫ్యామిలీ మొత్తానికీ ఆర్సినిక్ పాయిజన్ ఇచ్చేసేందుకు మారియా రెడీ అయ్యింది. సరిగ్గా అదే సమయంలో ఎవరికో ఆమెపై డౌట్ రావడం… పోలీసులకు కంప్లై్ంట్ ఇవ్వడం ఇవన్నీ జరిగాయి. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా ప్రశ్నించగా… నిజం ఒప్పుకుంది. తాను తన తల్లిదండ్రులతోపాటూ… మొత్తం 27 మందిని విషం ఇచ్చి చంపానని చెప్పింది. కానీ… చనిపోయిన వారి సంఖ్య 102గా ఉంది. వాళ్లందర్నీ ఆమే చంపి వుంటుందని భావిస్తున్నా అందుకు పోలీసుల దగ్గర ఆధారాలు లేవు.
మరో 45 మందికి రకరకాల వ్యాధులొచ్చాయి. వారిలో కూడా ఈ పాయిజన్ కొంత మొత్తంలో ఉన్నట్లు తేలింది. ఇలా ఇంత మంది ప్రాణాలు తీసిన మారియాకి కోర్టు జీవితఖైదు విధించింది. జైల్లో ఉంటూ మారియా 76 ఏళ్ల వయసులో 1915లో చనిపోయింది. ఇలా బాగా చదువుకున్న ఆమె ఆ చదువుకి ఏమాత్రం అర్థం లేకుండా సిరియల్ కిల్లర్ లా మారి ఇంతదారుణానికి ఓడికట్టింది. ఇలాంటి కథలు ఆధారంగానే ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి. క్రైమ్, హర్రర్ మూవీస్ కి ప్రేరణ ఇలాంటి కథలే ఎక్కువగా ఉంటాయి.
– Triveni Buskarowthu