రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రోజులు గడుస్తున్నాయి. రష్యా ధాటికి ఉక్రెయిన్ దేశం అల్లాడుతోంది. ఉక్రెయిన్ పరిస్థితి చూసిన నాటో దేశాలు ఉక్రెయిన్ కు సాయం చేస్తున్నాయి. అయితే.. దీంతో ఉక్రెయిన్ కూడా రష్యా దాడులను తిప్పి కొడుతోంది. అయితే.. ఉక్రెయిన్ పై యుద్దానికి దిగిన నాటి నుంచి పలు వాణిజ్య సంస్థలు రష్యా నుంచి వెళ్ళిపోతున్నాయి. అయితే ఇప్పుడు పుతిన్ కు మేక్ డొనాల్డ్స్ కంపెనీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే రష్యా తీరుకు నిరసనగా ఇప్పటికే ఆ దేశంలో కార్యకలాపాలను రద్దు చేసుకున్న పలు సంస్థలు రష్యాకు గుడ్ బై చెప్పేశాయి.
తాజాగా ఈ జాబితాలో అమెరికా ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్ డోనాల్డ్స్ కూడా చేరిపోయి రష్యాకు రాం.. రాం చెప్పేసింది. రష్యా మార్కెట్ నుంచి పూర్తిస్థాయిలో శాశ్వతంగా నిష్క్రమిస్తున్నట్లు మెక్ డోనాల్డ్స్ ప్రకటించింది. 30 ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు మెక్‌డోనాల్డ్స్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈ మేరకు సోమవారం మెక్‌డోనాల్డ్స్ నుంచి కీలక ప్రకటన విడుదలైంది.