నిన్నటి వేళ విష్వక్సేస్ అనే యువ కథానాయకుడి కొత్త సినిమాకు క్లాప్ కొట్టారు జనసేనాని పవన్ కల్యాణ్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇదే సందర్భంలో ఈ ప్రాజెక్టు లాంఛింగ్-కు ప్రకాశ్ రాజ్ వచ్చారు. ఇంకా ఇంకొందరు వచ్చారు. ప్రకాశ్ రాజ్ తో పాటు మంచు విష్ణు కూడా వచ్చారు.
ఒకప్పుడు తగాదాలతో, వాగ్వాదాలతో పవన్ ను టార్గెట్ చేసిన ప్రకాశ్ రాజ్ ఇప్పుడిప్పుడే మారిపోతున్నారు. ఆహా ! జస్ట్ ఆస్కింగ్ అంటూ నానా రాద్ధాంతం చేసిన ప్రకాశ్ రాజ్ ఇప్పుడిప్పుడే మళ్లీ పవన్ కు చేరువ అవుతున్నారు. అంటే ప్రకాశ్ రాజ్ ఏం మాట్లాడినా వినాలి.. పడాలి అన్నదే ఆయన సిద్ధాంతం అయితే ఆ విధంగా పవన్ ఎన్నింటినో విన్నాడు. ఎన్నింటినో భరించాడు. అయినా కూడా వీటిని విని కొన్ని సార్లు నవ్వుకున్నాడు కూడా !
నిన్నటి వేళ పవన్ తో ప్రకాశ్ రాజ్ ఏం చర్చించాడు. దేశానికి పెద్ద అయిన ప్రధాని మోడీని ప్రశ్నిస్తాను అని చెప్పే ప్రకాశ్ రాజ్ కొద్దికాలంగా తగ్గిపోయాడు. వెనక్కు తగ్గి మాట్లాడుతున్నాడు.ఇటీవల వచ్చిన సాయి పల్లవి ఇష్యూలో మాత్రం కొంత గొంతు వినిపించి ఊరుకున్నాడు. అయితే లెఫ్ట్ ఐడియాలజీ అంటే తనకు ఇష్టం అనే ప్రకాశ్ రాజ్ అదే ఐడియాలజీ ఉన్న మనుషులతో పవన్ కొంత కాలం పనిచేశాడన్న విషయాన్ని ఎందుకని గుర్తించలేకపోతున్నాడు.
ఆయన కూడా కొందరు ప్రజా కవులకు ప్రోత్సాహం ఇచ్చాడు. జీవితం ఇచ్చాడు. అవి కూడా గుర్తించలేకపోయాడు ఎందుకు ? అయినా ప్రకాశ్ రాజ్ ఏం మాట్లాడినా విని నవ్వి ఊరుకున్నాడు పవన్. పొత్తులన్నవి పార్టీల విధివిధానాలపై ఆధారపడి ఉంటాయి కదా ! మరి ! వైసీపీ ఎందుకు అదే పనిగా ఆయన్ను టార్గెట్ చేస్తుంది. గతంలో ఇదే పేర్నినాని లేదా ఇంకొందరు నాయకులు ప్రజారాజ్యంతోనో లేదా చిరంజీవితోనో రాసుకుపూసుకు తిరిగిన వారే కదా ! అవన్నీ ఎందుకు చిరంజీవి సినిమా బయ్యర్ గా కొడాని నాని తన లైఫ్ ను ఎలా మరిచిపోతారు. ఇవన్నీ వాస్తవాలే కదా ! అయినా పవన్ విని నవ్వి ఊరుకుంటాడు.