నేను చాలా హ్యాపీగా ఉన్నా:చిరంజీవి

-

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో జరిగిన ప్లాస్మా దాతల సన్మాన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. కరోనా కాలంలో ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని చిరంజీవి మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ప్లాస్మా డొనేషన్ కార్యక్రమాన్ని యజ్ఞంలా కొనసాగిస్తున్న సీపీ సజ్జనార్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలని ఆయన వ్యాఖ్యానించారు. నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

డాక్టర్లకు పోలీసులకు పారా మెడికల్ సిబ్బందికి.. పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలని అన్నారు. బ్లడ్ దొరక్క ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవడానికి సీసీటీ తరపున బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసానని ఆయన పేర్కొన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవార్డ్ వచ్చింది.. డిసెంబర్1 న అవార్డు తీసుకోబోతున్నానని అన్నారు. ప్లాస్మా.. కరోనా సోకిన వారికి సంజీవినిలా పనిచేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. కరోనాను జయించిన వారిలో మూడు నెలల పాటు యాంటీ బాడీస్ ఉంటాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news