Acharya: ఎవరూ ఊహించని విధంగా ‘ఆచార్య’ ఇంటర్వెల్ సీన్..మెహర్ రమేశ్ కామెంట్స్ ఇవే

-

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆచార్య’ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. శనివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో సినిమా గురించి ‘భోళా శంకర్’ దర్శకులు మెహర్ రమేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

రమేశ్ మాటలు మెగా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. తాను ‘ఆచార్య’ సినిమా ఇంటర్వల్ సీన్ చూశానని, ఎవరూ ఊహించని విధంగా యాక్షన్ సీక్వెన్సెస్ పిక్చర్ లో ఉన్నాయని చెప్పారు. తన స్నేహితుడు, ఇష్టమైన రచయిత కొరటాల శివ దర్శకత్వంలో వస్తు్న్న ఈ మూవీ డెఫినెట్ గా హిట్ అవుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు.

‘భలే భలే బంజారా’ సాంగ్ లో చిరంజీవి-రామ్ చరణ్ ల డ్యాన్స్ ను మెహర్ రమేశ్…శివుడు, కుమారస్వామిల నాట్యంతో పోల్చారు. వారిరువురు డ్యాన్స్ చేస్తుంటే చూడటానికి రెండు కళ్లు చాలవని తెలిపారు. మెగా ఫ్యాన్స్ కు ఓ పండుగలాంటి సినిమాని శివ ఇచ్చారన్నారు.

మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నారు. ఇది మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘వేదాళం’ రీమేక్. కాగా, ఇందులో హీరోయిన్ గా తమన్నా భాటియా, మెగాస్టార్ చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news