ఐపీఎల్ 2022 పోరు రసవత్తరంగా సాగుతోంది. జట్ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. అయితే నేడు ముంబాయిలోని బ్రబోర్న్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడింది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 2 ఓటముల తరువాత 4 విజయాలతో జోష్ మీదున్న ఆరెంజ్ ఆర్మీ పటిష్టమై ఆర్సీబీ జట్టుపై విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. రిలోకి దిగిన ఆర్సీబీ 68 పరుగులకే కుప్పకూలి అందరినీ షాక్‌కు గురిచేసింది. బౌలర్లు జానెసన్, నటరాజన్‌లు ఆర్‌సీబీ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.
జానెసన్, నటరాజన్ చెరో మూడు వికెట్లు సాధించగా, సుచిత్ రెండు, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్ తలా వికెట్ సాధించారు. ఆర్‌సీబీ బ్యాటర్లలో సుయాష్ ప్రభుదేసాయి 15 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే అనంతరం 69 పరుగుల లక్ష్య చేధనకు దిగిన ఆరెంజ్ ఆర్మీ.. 9 వికెట్ల తేడాతో ఆర్‌సీబీపై ఘన విజయం సాధించింది. 64 పరుగుల వద్ద ఎస్ఆర్ హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 47 పరుగులు చేసిన అభిషేక్ శర్మ..హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఎస్ఆర్‌హెచ్ వరుసగా ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.