హనీ హాట్ నెస్ ‌నెక్స్ట్ లెవల్..మోడ్రన్ డ్రెస్సులో మెరిసిపోతున్న మెహ్రీన్..

-

బ్యూటిఫుల్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా..తెలుగు ప్రేక్షకులకు ‘మహాలక్ష్మి’గా సుపరిచితం. తొలి చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’లో ఈ పాత్ర పోషించి ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది. ఇక ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించిన మెహ్రీన్..ఇటీవల పోషించిన పాత్రల్లో బాగా హైలైట్ అయిన రోల్ ‘హనీ’.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్2’ సినిమాలో ఈ రోల్ బాగా ఫేమస్ అయింది. ఇకపోతే మెహ్రీన్ క్యూట్ స్మైల్ తోనే కుర్రకారును ఫిదా చేస్తుంటుంది. సోషల్ మీడియాలో ప్రతీ రోజు తన అప్ డేట్స్ ఇస్తుంటుంది.

లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ లో ఎద అందాలు కనిపించేలా గులాబీ రంగు స్విమ్ సూట్ టైప్ డ్రెస్సులో దిగిన ఫొటోలు షేర్ చేసింది. స్విమ్మింగ్ పూల్ దగ్గర నడుస్తున్నట్లు, అలా ఓరగా చూస్తూ కవ్విస్తున్న ఫొటోలు షేర్ చేసింది.

సదరు ఫొటోల్లో మెహ్రీన్ హాట్ ఫోజులకు, స్మైల్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సమ్మర్ కే హీటెక్కించేలా హనీ హాట్ నెస్ నెక్స్ట్ లెవల్ లో ఉందని అంటున్నారు. ‘ఎవర్ గ్రీన్ స్మైల్, టూ గుడ్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ భామ నటించిన F3 చిత్రం ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.instagram.com/p/CdfDDRDP4BF/?igshid=MDJmNzVkMjY=

Read more RELATED
Recommended to you

Latest news