జగన్ ప్రభుత్వంలో పనిచేయడం నా అదృష్టం: మంత్రి నాగార్జున

-

చంద్రబాబు పాలనలో ఏపీ ప్రజలకు ఒరిగిందేమీ లేదని మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. రాష్ట్రంలో అడ్డదారిలో మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పరిపాలన చేస్తుంటే.. ఓర్వలేక చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రి నాగార్జున చెప్పారు.

Merugu Nagarjuna: రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు - NTV Telugu

ఇదిలా ఉంటే.. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండల పరిధిలోని ఆవులవారి పాలెం గ్రామంలో శనివారం గ్రామసచివాలయ సిబ్బందితో, వాలంటీర్లతో, గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ప్రతి గృహాన్ని సందర్శించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 3 సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి కరపత్రాల ద్వారా వివరించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నాని, పార్టీ వివిధ శ్రేణుల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news