బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ ట్రైలర్‌ డేట్‌ లాక్‌

-

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత ‘వీర సింహా రెడ్డి’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా వీర సింహారెడ్డి అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లో 107వ సినిమాగా రూపొందుతోంది. ఈ సినిమాలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. ‘క్రాక్‌’ వంటి భారీ విజయం తర్వాత గోపిచంద్ మలినేని, బాలయ్యతో సినిమా చేయనుండటంతో అటు అభిమానుల్లో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ చేస్తున్నారు.

Veera Simha Reddy Hunt Trailer | Nandamuri Balakrishna | Shruti Haasan | Gopichandh Malineni | - YouTube

ప్రస్తుతం చిత్ర యూనిట్‌ ప్రమోషన్‌లను ప్రారంభించే పనిలో ఉంది. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను పెద్ద ఎత్తులో నిర్వహించాలని ప్లాన్‌ చేస్తుంది. ఈ నేపథ్యంలో జనవరి ఆరో తేదిన ఒంగోలులో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను జరుపనున్నట్లు తెలుస్తుంది. కాగా అదే రోజున ఈ సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేయనున్నారట. అవుట్ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ సంస్థ నిర్మించింది. బాలయ్య ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ యాక్టర్‌ దునియా విజయ్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు పోటీగా రిలీజవుతున్న ‘వాల్తేరు వీరయ్య’ను కూడా మైత్రీ సంస్థే నిర్మించింది. ఇన్నేళ్ళ సినీ ఇండస్ట్రీలో మొట్ట మొదటి సారిగా ఒకే బ్యానర్‌లో తెరకెక్కిన సినిమాలు ఒకటి, రెండు రోజుల గ్యాప్‌లో రిలీజవడం ఇదే మొదటి సారి. మరీ మైత్రీకి ఈ రెండు సినిమాలు కలిసి వస్తాయో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news