IPL MI vs KKR : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌క‌త్త‌.. తుది జ‌ట్లు ఇవే

-

ఐపీఎల్ 2022 లో భాగంగా నేడు ముంబై ఇండియ‌న్స్, కోల్ క‌త్త నైట్ రైడ‌ర్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతుంది. ఈ మ్యాచ్ పూణే న‌గ‌రంలోని మ‌హారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జ‌రుగుతుంది. కాగ ఈ మ్యాచ్ లో కీల‌క మైన టాస్ ను కోల్‌క‌త్త నైట్ రైడ‌ర్స్ గెలిచింది. దీంతో కెప్టెన్ శ్రేయ‌స్ అయ్యార్.. మొద‌ట బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. దీంతో రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది.

వ‌రుస‌గా రెండు మ్యాచ్ ల‌లో ఓడిన రోహిత్ సేన‌.. ఈ మ్యాచ్ లో విజ‌యం సాధించి బోణి కొట్టాల‌ని చూస్తుంది. అలాగే కోల్‌క‌త్త నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేయాల‌ని ప్ర‌ణాలిక‌ల‌ను సిద్ధం చేస్తుంది. కాగ ఈ మ్యాచ్ కోసం తుది జ‌ట్లు ఇలా ఉన్నాయి.

ముంబై ఇండియన్స్ తుది జ‌ట్టు :
ఇషాన్ కిషన్ ( వికెట్ కీప‌ర్ ), రోహిత్ శర్మ ( కెప్టెన్ ), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, డేనియల్ సామ్స్, డెవాల్డ్ బ్రెవిస్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి

కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జ‌ట్టు :
అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ ( కెప్టెన్ ), సామ్ బిల్లింగ్స్ ( వికెట్ కీప‌ర్ ), నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, పాట్ కమిన్స్, ఉమేష్ యాదవ్, రసిఖ్ సలామ్, వరుణ్ చకరవర్తి

Read more RELATED
Recommended to you

Latest news